వైరల్ : పుష్ప సినిమాకు భారీ సంఖ్యలో మహిళల మద్దతు.. కారణం..!!

Divya
సినీ ఇండస్ట్రీలో ఏదైనా ఒక విషయం మహిళలకు లేదా పురుషులకు నచ్చింది అంటే ఆ మండల విభాగం సినిమాకు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే . ముఖ్యంగా కేవలం మహిళలు.. పురుషులు అనే కాకుండా యువత కూడా తమకు నచ్చిన విషయాల్ని సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ ఉంటుంది. ఇక తాజాగా డిసెంబర్ 17వ తేదీన అనగా రేపు ఉదయం పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే.

ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపుపొందిన సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూడవసారి పుష్ప పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించడం గమనార్హం. ఈ సినిమాలో భుజం నొప్పితో బాధపడుతూ పుష్ప రాజు పాత్రలో మనకు సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు అల్లు అర్జున్. నేషనల్  క్రష్ రష్మిక కూడా హీరోయిన్ గా అవకాశం కొట్టేసి తన సత్తా ఏంటో చాటడానికి సిద్ధమవుతోంది. ఇక అనసూయ, కమెడియన్ సునీల్ లాంటి వారిని కూడా ఎప్పుడూ చూడని విధంగా సరికొత్తగా విలన్ పాత్రలో చూపించబోతున్నాడు దర్శకుడు సుకుమార్. నిజం చెప్పాలంటే దర్శకుడు సుకుమార్ అనసూయ కోసమే ఒక ప్రత్యేకమైన పాత్రను రూపొందించారని సమాచారం.. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు పాటలకు ట్యూన్ ను అందించినా ప్రతి పాట కూడా ప్రేక్షకుల్లో మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది.
ఇక ఐటమ్ సాంగ్ లో కూడా సమంత మెరిసినా ఈ పాటకు కూడా మంచి క్రేజ్ రావడం గమనార్హం.. ఇకపోతే దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఊ అంటావా ఊ ఊ అంటావా అనే సినిమా పాట మగ జాతికి విరుద్ధంగా ఉందని పురుష మండలి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అంతేకాదు వెంటనే ఈ పాటను తొలగించాలంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు మహిళా మండలి ఈ సినిమాకు సపోర్ట్ గా నిలవడం సంచలనంగా మారింది.
అయితే ఈ పాట పట్ల రాష్ట్ర పురుష సంఘం తమ అసహనం వ్యక్తం చేస్తే.. అమరావతి తాళ్లూరు గ్రామానికి చెందిన మహిళా మండలి వారు మాత్రం ఈ పాటకి పూర్తి మద్దతు ఇవ్వడం ఆసక్తిగా మారింది. వారు సమంతా సాంగ్ కి పూర్తి మద్దతు ఇస్తున్నామని.. సినిమా రిలీజ్ రోజే వెళ్లి విజిల్ కూడా కొడతామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత ఎస్ కె ఎన్ వెల్లడించారు. దీనితో ఈ అంశం బాగా  వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: