హ్యాపీ సండే: ఈ వారం ప్రభాస్ విశేషాలివే... !

GVK Writings
టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ ప్రస్తుతం లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడేకర్, జయరాం తదితరులు ఇతర పాత్రలు చేస్తుండగా పాన్ ఇండియా మూవీగా దీనిని యువి క్రియేషన్స్ వారు ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుండగా ఈ మూవీ టీజర్, రెండు సాంగ్స్ ఇప్పటికే రిలీజ్ చేసింది యూనిట్. అవి అందరి నుండి మంచి రెస్పాన్స్ అందుకుని మూవీపై బాగా అంచనాలు పెంచాయి. కాగా ఇంకోవైపు మరొక మూడు సినిమాల షూటింగ్స్ కూడా చేస్తున్నారు ప్రభాస్. ఓం రౌత్ తీస్తున్న ఆదిపురుష్ లో రాముడిగా ప్రభాస్ కనిపించనుండగా కృతి సనన్ సీత పాత్ర చేస్తోంది. టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ మూవీ కూడా కొద్దిరోజుల క్రితం షూటింగ్ పూర్తికి చేసుకుంది. దీనితో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా కూడా చేస్తున్నారు ప్రభాస్.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని హోంబలె ఫిలిమ్స్ వారు నిర్మిస్తుండగా దీని షూటింగ్ కూడా ప్రస్తుతం జరుగుతోంది. వీటితో పాటు చివరిగా రెండు రోజుల క్రితం వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ అశ్విన్ తీస్తున్న ప్రాజక్ట్ కె మూవీ షూటింగ్ లో హీరోయిన్ దీపికా పదుకొనె తో కలిసి జాయిన్ అయ్యారు ప్రభాస్. ఈ విధంగా తన కెరీర్ ని వరుసగా ప్లాన్ చేస్తున్న ప్రభాస్ వీటి అనంతరం సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ అనే భారీ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. మరి ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో ప్రభాస్ ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వరకు ఆగాల్సిందే అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: