రజని @71: మొదటి సినిమాతోనే ఆ స్టార్ హీరోయిన్ కి తండ్రిగా నటించిన రజని...!

murali krishna
రజనీకాంత్ చిత్రసీమలో అడుగుపెట్టక ముందు బెంగళూరులో సిటీ బస్ కండక్టర్ గా పనిచేశారని అందరికి తెలుసు.. ఆ సమయంలో ప్రతి రోజూ సెకండ్ షో చూడడం ఆయనకు అలవాటుగా ఉండేదని తెలుస్తుంది.
రజనీ మాతృభాష మరాఠీ అని పెరిగిందేమో కర్ణాటక రాజధాని బెంగళూరులో అని అయినా ఆయనకు తెలుగు నటులు యన్టీఆర్ సినిమాలంటే భలే ఇష్టమట. యన్టీఆర్ ‘శ్రీకృష్ణ పాండవీయం’ చిత్రాన్నిబెంగళూరులో పలు మార్లు చూశానని చెబుతారట.అలాగే యన్టీఆర్ పౌరాణికాలంటే ఆయనకు ఎంతో అభిమానమని తెలుస్తుంది.ఇక హిందీ నటుడు శత్రుఘ్న సిన్హా స్టైల్ కూడా రజనీకాంత్ ను ఎంతగానో ఆకట్టుకుందని యన్టీఆర్, శత్రుఘ్న సిన్హా స్టైల్స్ ను మిక్స్ చేసి వాటికి తనకు వచ్చిన కొన్ని ట్రిక్స్ కలిపి ‘రజనీ స్టైల్’ సృష్టించుకున్నారని తెలుస్తుంది.
రజనీకాంత్ తొలి తెలుగు చిత్రం ‘అంతులేని కథ’. ఈ సినిమాలో ఆయనపై “దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి.” పాటను చిత్రీకరించారట.. ఏసుదాస్ నేపథ్యగానం చేసిన ఈ పాట ఇప్పటికీ జనాదరణ పొందుతూనే ఉందని తెలుస్తుంది.. ఈ పాటలో రజనీ నటనను గమనిస్తే యన్టీఆర్ ను ఎలా అనుకరించిందీ ఇట్టే తెలిసిపోతుందట. మధ్యలో సిగరెట్ ను ఎగరేసుకుంటూ తాగడం అన్నది తన స్టైల్ గా మిక్స్ చేశారట రజనీ.
రజనీ కాంత్ తొలి చిత్రం నుండీ తెలుగువారితో అనుబంధం ఉందనే చెప్పవచ్చు. బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రం ద్వారా రజనీ తెరకు పరిచయం అయ్యారట. ఆ సినిమాలో శ్రీవిద్య భర్తగా నటించారట. వారి అమ్మాయిగా జయసుధ కనిపించారు. అంటే తొలి సినిమాలోనే జయసుధకు తండ్రిగా రజనీ నటించారన్న మాట! ఇక రజనీకాంత్ తొలి తెలుగు చిత్రం ‘అంతులేని కథ’. ఇందులో ఆయన జయప్రదకు అన్నగా నటించి మెప్పించారట.. ఇలా తమిళ, తెలుగు తొలి చిత్రాల్లో జయసుధ మరియు జయప్రద బంధువుగా నటించిన రజనీ, తరువాతి రోజుల్లోనూ ఆ అనుబంధాన్ని అలాగే కొనసాగించారట.
తమిళ, తెలుగు మరియు కన్నడ చిత్రాలలో రజనీకాంత్ ఏ అవకాశం చిక్కినా వదలుకొనేవారు కాదని తెలుస్తుంది.. మురళీమోహన్ హీరోగా రూపొందిన ‘తొలిరేయి గడిచింది’లో చిన్న పాత్ర అయినా పోషించారని తెలుస్తుంది.. అలాగే మురళీమోహన్ హీరోగా రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఆమె కథ’లోనూ రజనీకాంత్ ప్రతినాయకునిగా నటించారట. ‘చిలకమ్మ చెప్పింది’లో సంగీతకు జోడీగా నటించారట..
‘అన్నదమ్ముల సవాల్’లో తన కంటే వయసులో పెద్ద అయిన కృష్ణకు అన్నగా నటించారట.. ఆ తరువాత కృష్ణతో కలసి ‘ఇద్దరూ అసాధ్యులే, రామ్ రాబర్ట్ రహీమ్’లోనూ రజనీ అభినయించారట.శోభన్ బాబు తమ్మునిగా ‘జీవనపోరాటం’లో కనిపించారని అప్పటికే రజనీకాంత్ తమిళనాట టాప్ స్టార్ అని తెలుస్తుంది.. అయినా, తెలుగుపై అభిమానంతో నిర్మాత సుబ్బరామిరెడ్డి అడగ్గానే నటించారట రజని.
చిత్రసీమలో రజనీకాంత్ మరియు మోహన్ బాబు ఇద్దరూ ఒకే సమయంలో ప్రవేశించారట.అప్పటి నుంచీ ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉందట. రజనీ తొలి చిత్రం ‘అపూర్వ రాగంగళ్’లో ఆయన పోషించిన పాత్రను తెలుగు రీమేక్ ‘తూర్పు -పడమర’లో మోహన్ బాబు ధరించారట. అలాగే తమిళంలో రజనీ పోషించిన పాత్రను తెలుగు ‘పదహారేళ్ళ వయసు’లో మోహన్ బాబు అభినయించారట. ఇక ‘అమ్మ ఎవరికైనా అమ్మ’ చిత్రంలో రజనీ హీరోగా, మోహన్ బాబు విలన్ గా నటించారని తెలుస్తుంది. ఆ మైత్రీబంధంతోనే ‘పెదరాయుడు’ సినిమా రీమేక్ రైట్స్ మోహన్ బాబుకు ఇప్పించి, ఆ చిత్రంలో పాపారాయుడు పాత్రలో నటించి అలరించారట రజనీకాంత్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: