కంగనా మరో బయోపిక్.. క్రేజీగా కొత్త ప్రాజెక్ట్?

praveen
ఇటీవలి కాలంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బయోపిక్ హావ ఎక్కువైపోయింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఎన్నో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇక ఇలాంటి సినిమాలు అటు ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తున్నాయి అని చెప్పాలి. ఇలా పలువురు ప్రముఖులకు చెందిన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలు ఇప్పటికే మంచి విజయాలను సాధించాయి. ఇక అటు సినిమా ఇండస్ట్రీలో స్టార్ లుగా కొనసాగుతున్న వారు సైతం బయోపిక్ లలో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇటీవల కాలంలో వరుసగా బయోపిక్ లలో నటిస్తూ మంచి విజయాలను ఖాతాలో వేసుకుని దూసుకుపోతుంది బాలీవుడ్ కాంట్రవర్షియల్ బ్యూటీ కంగనారనౌత్.

 ఒకప్పుడు గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు బయోపిక్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మణికర్ణిక సినిమాలో నటించి ఎన్నో ప్రశంసలు అందుకుంది. తర్వాత తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి తమిళ ప్రజలందరికీ అమ్మ జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన  తలైవి సినిమాలో కూడా నటించింది. ఇక జయలలిత పాత్రలో కంగనా రనౌత్ ఊగిపోయి నటించిన తీరు అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు మరో బయోపిక్ లో నటించేందుకు సిద్ధమైంది.

 ఆకాశాన్ని ఏలాలాని నిర్ణయించుకున్న ఒక స్త్రీ జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురుకుంది చివరికి అనుకున్నది ఎలా సాధించింది అన్న విషయాన్ని తెలియజేస్తూ ఎయిర్ ఫోర్స్ పైలట్ తేజస్ గిల్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న తేజస్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది కంగనారనౌత్. ఇక ఈ సినిమా అక్టోబర్ ఐదు, 2022 తేదీనా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని కంగనారనౌత్ ప్రకటించింది. ఇక దీనికి సంబంధించి తన సోషల్ మీడియా ఖాతాలో కంగనారనౌత్ పోస్ట్ పెట్టగా.. ఈ పోస్టు వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: