లక్కీ బ్యూటీ శర్వానంద్ కు విజయాన్ని తీసుకురాగలదా..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు, ఆ తరువాత మెయిన్ హీరో గా మారిన ఈ నటుడు ప్రస్థానం, రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి లాంటి సూపర్ హిట్ సినిమా లతో తెలుగు ఇండస్ట్రీ లో క్రేజీ హీరో గా మారిపోయాడు. తెలుగు ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ఈ హీరో పడి పడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకారం, మహా సముద్రం వంటి వరుస పరాజయాలతో బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోయాడు. ఇలా వరుసగా ఐదు సినిమాలు నిరాశ పరచడం తో శర్వానంద్ ఎలాగైనా తన తదుపరి సినిమాలతో మంచి విజయాలను అందుకోవాలి అని ఆశిస్తున్నాడు. ప్రస్తుతం శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు, ఈ సినిమాలో లక్కీ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.

 రష్మిక మందన, నాగ శౌర్య హీరో గా నటించిన చలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చింది, మొదటి సినిమా తోనే అదిరిపోయే విజయాన్ని అనుకోవడం మాత్రమే కాకుండా నాగ శౌర్య  కు కూడా కెరియర్ బెస్ట్ గా చలో సినిమా నిలిచింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం సినిమాలో నటించిన ఈ ముద్దు గుమ్మ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా విజయ్ దేవరకొండ కు కూడా ఈ సినిమా అదిరిపోయే విజయాన్ని తెచ్చి పెట్టింది. ఇలా తాను నటించిన ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయవంతం కావడంతో రష్మిక మందన, శర్వానంద్ కు కూడా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో అదిరిపోయే విజయాన్ని తెచ్చి పెడుతుంది అని కొంత మంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: