ఏపీ ప్రభుత్వంపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేసిన సిద్దార్థ్..!

murali krishna
ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్స్ ధరలను నిర్ణయిస్తూ ఓ చట్టం చేసిన చేసిన విషయం అందరకి తెలిసిందే. ఇవి కాకుండా గతంలో బెనిఫిట్ షోలకు ఉన్న అనుమతులు కూడా రద్దు చేసారని తెలుస్తుంది..

ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని టాలీవుడ్ లోని కొందరు సినీ ప్రముఖుల వ్యతిరేకిస్తూ ఉండగా ఇప్పుడు వారి జాబితాలో సిద్ధార్థ్ చేరారట.ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్ లైన్ మూవీ టికెటింగ్ విధానాన్ని సహా కొత్త రేట్లకు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలు చేస్తూ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిందట.కొత్త చట్టం అమల్లోకి రావడంతో రాష్ట్రంలో సినిమా టికెట్ల విక్రయం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరగనుందట. అలాగే రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయడంతో పాటు ఏ సినిమాకైనా టికెట్ల ధరలు పెంచేది లేదని.. అన్నింటికీ ఒకేలా ఉంటాయని కూడా పేర్కొన్నారట.


ముందు మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ "పరిశ్రమ కోరిన విధంగా పారదర్శక కోసం ఆన్ లైన్ టికెటింగ్ బిల్లు ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయమని అదేవిధంగా థియేటర్ల మనుగడ కోసం అలాగే సినిమా ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాలు బతుకుదెరువు కోసం తగ్గించిన టికెట్ రేట్స్ ని కాలానుగుణంగా అలాగే సముచితంగా దేశంలోని అన్ని స్టేట్స్ లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుందని చెప్పారట దేశమంతా ఒకటే జీఎస్టీగా ట్యాక్సులు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసమని తెలుస్తుంది.. దయచేసి ఈ విషయమై పునరాలోచించండని ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కు కోగలుగుతుంది'' అని చిరు ట్వీట్ చేశారట.

ఆ తరువాత ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు సినిమా టికెట్స్ ధరలు మరియు షోలపై స్పందిస్తూ నాకు ఇండస్ట్రీలో ఉన్న అనుభవంతో చెబుతున్నాను దయచేసి అర్థం చేసుకోండి తన అభిప్రాయాలు కొన్ని వెల్లడించారట. ఈ మేరకు ఆయన సుదీర్ఘంగా పెద్ద పోస్ట్ చేశారట. అందులో టికెట్ రేట్ల తగ్గింపు ఆన్ లైన్ టికెట్ విధానం మరియు బ్లాక్ టికెట్ దందాలు గురించి మాట్లాడారట.

టికెట్ రేట్లు పెంచి ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని అమలు పరిచితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని సూచించారట.. ఇక తాజాగా హీరో సిద్ధార్థ్ సినిమా టికెట్ ధరల నిర్ణయం మీద స్పందించారట.తాజాగా టాలీవుడ్ ఏపీ ప్రభుత్వ విధానాలపై హీరో సిద్దార్థ్ మండిపడ్డారట ఓ రెస్టారెంట్‌కు ప్లేట్ ఇడ్లీ మరియు కాఫీ ఎంత రేటు ఉండాలో మీరు చెప్పరు కానీ సినిమా పరిశ్రమ మీకు ఎందుకు అంత శ్రద్ధ వాళ్ల పెట్టుబడిని వాళ్లు రికవరీ చేసుకుంటే ఏమవుతుంది అని అన్నారట.

టికెట్ రేట్ల మీద వచ్చిన జీవో మరియు అదనపు షోలను రద్దు చేయడమనేది ఎంఆర్పీటీ వయలేషన్స్ కిందకు వస్తుందన్న ఆయన దయచేసి సినిమా మరియు సినిమా హాళ్లకు బతికే చాన్స్ ఇవ్వండి అంటూ థియేటర్ రెంట్ మరియు ఎంత పెట్టుబడి పెడుతున్నారు ఆ ఏరియా బట్టి సరైన రేటును డిసైడ్ చేయండని ప్రభుత్వాలకు సిద్దార్థ్ సూచించారట.ఏపీలో సినిమా టికెట్ ధర కప్పు టీ కంటే చీప్ అయింది అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: