ఆ రెండు సినిమాల పై ఆశలు పెట్టుకున్న శర్వానంద్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కెరియర్ ప్రారంభం లో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వేస్తూ తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ ఆ తర్వాత కాలంలో సోలో హీరో గా సినిమాలు చేశాడు. అందులో భాగంగా శర్వానంద్ నటించిన ప్రస్థానం, రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో టాలీవుడ్ లో శర్వానంద్ మంచి హీరో గా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇలా మంచి విజయ వంతమైన సినిమా లతో టాలీవుడ్ లో క్రేజీ హీరో గా మారిన శర్వానంద్ పడి పడి లేచే మనసు, రణరంగం, జాను,  శ్రీకారం, మహా సముద్రం ఇలా వరుస అపజయాలతో బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోయాడు. ఈ మధ్య థియేటర్ లలో విడుదలైన మహా సముద్రం సినిమాతో అయినా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందు కోవాలని అనుకున్న శర్వానంద్ కు ఈ సినిమా కూడా నిరాశనే మిగిల్చింది.

 ఈ సినిమా కు ఆర్ఎక్స్100 ఫెమ్ భూపతి దర్శకత్వం వహించగా శర్వానంద్ తో పాటు సిద్ధార్థ్ కూడా మరో హీరో గా నటించాడు. అయితే ఇలా వరుస పరాజయా లతో డీలా పడిపోయిన శర్వానంద్ ప్రస్తుతం ఆడవాళ్లు మీకు జోహార్లు, ఒకే ఒక జీవితం అనే రెండు సినిమా ల్లో హీరో గా నటిస్తున్నాడు. ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండ గా, ఒకే ఒక జీవితం లో రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ రెండు సినిమా లతో అయినా శర్వానంద్ ఫామ్ లోకి వస్తాడా లేదా తెలియాలి అంటే ఈ రెండు సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: