ఇలాంటి స్క్రిప్ట్ వింటే ఎవరైనా సరే ఎగ్జయిట్‌ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ నిత్యా మీనన్ నాని హీరో గా తెరకెక్కిన అలా మొదలైంది సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా మంచి విజయం సాధించడం తో పాటు నిత్యా మీనన్ నటన కూడా తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడటం తో టాలీవుడ్ ఈ ముద్దు గుమ్మకు క్రేజీ సినిమా అవకాశాలు కూడా దక్కాయి. అందులో భాగంగా ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే వంటి అనేక సినిమా లలో నటించిన నిత్య మీనన్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది. తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ వెబ్ సిరీస్ లలో కూడా నటించి మెప్పించింది. ఇలా సినిమా లతో, వెబ్ సిరీస్ లతో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న నిత్య మీనన్ ప్రస్తుతం నిర్మాణ రంగం లోకి కూడా ఎంటర్ అయ్యింది.

సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన స్కైలాబ్  సినిమాలో నిత్యా మీనన్ నటించడం మాత్రమే కాకుండా, ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం లో తెరకెక్కిన  స్కైలాబ్‌ 1979‌ లో సాగే పీరియాడిక్ మూవీ గా రూపొందింది, ఈ సినిమా డిసెంబర్ 4 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా హీరోయిన్ నిత్యా మీనన్ ఈ మూవీ విశేషాలను మీడియా కు తెలియచేసింది.
నిత్యా మీనన్ మాట్లాడుతూ.. స్కైలాబ్‌ లాంటి స్క్రిప్ట్ వింటే ఎవరైనా ఎగ్జిట్ అవుతారు. ఈ సినిమా లో నటించిన సత్య అండ్‌ రాహుల్‌ తో నాకు కాంబినేషన్‌ సీన్స్ లేవు. ఈ సినిమా లో తెలంగాణ యాస మాట్లాడాను. నాకు తెలంగాణ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని నిత్యా మీనన్ తెలియ జేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: