టాలెంట్ ఉన్నా నో లక్.. పాపం ఆ హీరోయిన్?

praveen
సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత కొత్త హీరోయిన్లు ఎప్పుడూ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించడమే  కాదు ఒక్కసారిగా యూత్ మొత్తాన్ని అందం అభినయంతో ఆకర్షించి ఏకంగా స్టార్ హీరోయిన్ గా మారి పోతూ ఉంటారు. అయితే ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ సినీ పరిశ్రమలో రాణించాలంటే అదృష్టం కూడా కలిసి రావాలి. చివరికి అదృష్టం కలిసి రాక అవకాశాలు దక్కగా ఎంతోమంది కనుమరుగు అవుతూ ఉంటారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఒక ఊపుఊపి ఇక ఇప్పుడు అవకాశాలు లేక  తెలుగు తెరకు దూరమైన హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు అని చెప్పాలి. ఈ అమ్మడికి యూత్ లో ఒక రేంజ్ లో క్రేజ్ వుంది.

 ఈ అమ్మడు ఒక్కసారి తెర మీద కనిపించింది అంటే చాలు యూత్ అందరూ కూడా ఉర్రూతలూగి పోతూ ఉంటారు. అయితేకోలీవుడ్ సినిమా ప్రేమమ్ లో మొదట సినీ రంగ ప్రవేశం చేసింది అనుపమ పరమేశ్వర్.  మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలోకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆఆ అనే సినిమాతో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత శతమానం భవతి అనే ఫ్యామిలీ   కథాంశంతో తెరకెక్కిన సినిమాలో హీరోయిన్ గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

 శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది అని చెప్పాలి. ఈ సినిమాలో ఈ అమ్మడు అందం అభినయం అందర్నీ ఆకట్టుకుంది.. ఈ క్రమంలోనే  ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నప్పటికీ అంతగా గుర్తింపు సంపాదించలేకపోయింది. ఈ అమ్మడు నటించిన రాక్షసుడు సినిమా మంచి విజయం సాధించినప్పటికీ ఈ సినిమా ఈ హీరోయిన్ కు గుర్తింపు మాత్రం తెచ్చి పెట్టలేకపోయింది. టాలెంట్ వున్న ప్పటికీ అదృష్టం కలిసి రాకపోవడంతో అవకాశాలు అందుకోలేకపోయింది అనుపమ పరమేశ్వరన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: