ట్రస్ట్ ద్వారా పేదలకు సేవలు అందిస్తున్న అలీ..!

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తనదైన శాలిలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ వారి ఆదరణ పొందుతున్నాడు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే నటులు ఎవరు అని అడిగితే ముందు బ్రహ్మనందం ఆ తర్వాత వినిపించే పేరు అలీ అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వులో ముంచెత్తుత్తారు.
అలీ ఇండస్ట్రీకి బాల నటుడిగా సీతాకోకచిలుక సినిమాతో పరిచయమైయ్యాడు. ఈ సినిమాలో అలీ నటనకు అవార్డుతో పాటు, మంచి గుర్తింపుని కూడా తీసుకొచ్చింది. అలీ ఆ తరువాత కమెడియన్ గా అవతారం మెత్తారు.  ఇక 'ప్రేమఖైదీ' సినిమాలో బ్రహ్మానందం, బాబు మోహన్, కోట శ్రీనివాసరావు తో పాటు ఆలీ కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

 తరువాత ఎస్ వీ కృష్ణ రెడ్డి దర్శకత్వంలో అలీ 'యమలీల' సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమాతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నటుడిగా, హాస్యనటుడిగా సుమారు 1100 కి పైగా సినిమాల్లో నటించారు. అంతేకాదు.. బుల్లితెరపై కూడా పలు షోలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.


అయితే అలీ ప్రజలకు సేవ చేయడంలో ముందు ఉంటారు. ఆయన తన తండ్రి పేరు మీదుగా మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా పేదలకు సేవలు అందిస్తున్నారు. అంతేకాదు.. అలీ సినీ కెరియర్ లో ఎన్నో అవార్డులు, సన్మానాలను అందుకున్నారు. అయితే 1999 లో నటుడు మురళీమోహన్ అలీ కి  తెలుగు దేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఇక 2019 మార్చిలో వైసీపీలో చేరారు. అలాగే అలీ సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ చాలా చురుకుగా ఉంటారు. అలీ తన తల్లి పేరు మీద పేదలకు బట్టలు కూడా పంపిణి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: