నయనతార ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా?

praveen
ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతూ హీరోల రేంజ్ లో క్రేజ్ సంపాదించి దూసుకుపోతుంది నయనతార. ఒకప్పుప్పుడు గ్లామర్ హీరోయిన్గా దక్షిణ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఎన్నో సినిమాల్లో అందాల ఆరబోత చేసి అందరినీ మంత్రముగ్ధులను చేసింది. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు దాదాపుగా అందరు స్టార్ హీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ లో యువ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు అందరూ ఈ ముద్దుగుమ్మ తో నటించాలని ఆశ పడుతూ ఉంటారు అని చెప్పాలి.

 సీనియర్ హీరోలు జూనియర్ హీరోలు అనే తేడా లేదు ఎవరి సరసన నటించిన వారికి పర్ఫెక్ట్ జోడి అనిపించుకుంటుంది నయనతార. అయితే ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా నయనతార కొనసాగుతోంది. అయితే చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నప్పటికీ ఇక ఆ హీరో హీరోయిన్లకు కూడా ఫేవరెట్ నటీనటులు  ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక తమ అభిమాన హీరో హీరోయిన్లు  అభిమానించే నటీనటులు ఎవరు అన్న విషయాన్ని తెలుసుకునేందుకు అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఇక దీనికోసం గూగుల్ తల్లిని ఆశ్రయిస్తూ తెగ వెతుకుతూ ఉంటారు.

 ఎంతో మంది నయనతార అభిమానులు కూడా నయనతార ఎక్కువగా అభిమానించే నటీనటులు ఎవరు అన్న విషయాన్ని చాలానే సోషల్ మీడియా వేదికగా వెతికారు. ఇక నయనతార అభిమానించే హీరో హీరోయిన్లు ఎవరు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న నయనతార ఫేవరెట్ హీరోయిన్ సిమ్రాన్. ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటిన సిమ్రాన్ నటన  అభినయం అంటే నయనతారకు చాలా ఇష్టమట. చిన్నప్పుడు సిమ్రాన్ సినిమాలను చాలాసార్లు చూసేదట నయనతార. ఇక హీరోల లో  దళపతి విజయ్ నయనతార ఫేవరెట్ హీరో నట. ఇక విజయ్ సినిమాలను కూడా మిస్ కాకుండా చూస్తుందట నయనతార.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: