సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో సూపర్ హిట్ అయిన ఐటెం సాంగ్స్..!

Pulgam Srinivas
కొంత మంది దర్శకులు ఎన్ని సినిమాలకు దర్శకత్వం వహించిన కేవలం ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ తోనే పని చేస్తూ ఉంటారు. దానికి ప్రధాన కారణం వారి ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ అయి ఉండవచ్చు, లేకపోతే సంగీతం విషయంలో వారిద్దరి మధ్య ఉన్న అండర్ స్టైన్మెంట్ అయి ఉండవచ్చు. అయితే తెలుగు ఇండస్ట్రీలో కూడా అలాంటి మ్యూజిక్ కాంబినేషన్ లలో ఒకటి సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ అయిన ఐటమ్ సాంగ్స్ గురించి మనం తెలుసుకుందాం..
అ అంటే అమలాపురం : ఈ పాట 2004 లో విడుదలైన ఆర్య సినిమా లోనిది. ఈ పాటలో అభినయ తన అంద చందాలతో డాన్స్ తో యువతను ఉర్రూతలూగించింది.
36,  24, 36 : ఈ పాట 2007 లో విడుదలైన జగడం సినిమా లోనిది. ఈ పాట కూడా అప్పట్లో జనాలను ఎంతగానో అలరించింది.
రింగ రింగా : ఈ పాట 2009 లో విడుద లైన ఆర్య టు సినిమా లోనిది. ఈ పాట ఆ టైం లో ఫుల్ సక్సెస్ అయింది.
డియ్యాలో డియ్యాల : ఈ సాంగ్ 2011 లో విడుదలైన 100 పర్సెంట్ లవ్ సినిమా లోనిది. ఈ సినిమా లోని ఈ పాట అప్పట్లో ప్రేక్షకులను ఎంత గానో అలరిస్తుంది.
లండను బాబు : ఈ సాంగ్ 2014 లో విడుదలైన 1 నేనొక్కడినే సినిమా లోనిది. ఈ పాట ఎంతో మంది శ్రోతలను ఆకట్టుకుంది.
జిగేల్ రాణి : ఈ పాట 2018 లో విడుదల అయిన రంగస్థలం సినిమా లోనిది. ఈ పాట ఎంతో మంది జనాలను అలరించింది.
బ్రేకప్‌ ప్యాట్చప్‌ : ఈ పాట 2015 లో విడుదల అయి న కుమారి 21 ఎఫ్ సినిమా లోనిది. సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన పోయినప్పటికీ ఈ సినిమాకు ఈ కథను అందించాడు. ఈ సినిమాకు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించాడు, ఈ సినిమా లోని  ఈ పాట కూడా జనాలను ఎంత గానో అలరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: