క్యారెక్టర్ డిమాండ్.. డబ్బుల కోసం మారిపోయిన హీరోయిన్..?

NAGARJUNA NAKKA
కృతి సనన్‌ మైథలాజికల్‌ మూవీ చేస్తుందని, 'సీత' పాత్ర పోషిస్తుందనే అనౌన్స్‌మెంట్‌తో బాలీవుడ్‌ జనాలు కూడా ఆశ్చర్యపోయారు. అయితే 'మామి' సినిమాతో ఈ అనుమానాలన్నింటినీ క్లియర్ చేసింది కృతి. ఇక ఈ హిట్‌తో కృతి రెమ్యూనరేషన్‌ కూడా భారీగా పెరిగిపోయింది. టాప్ హీరోల రేంజ్‌లో డిమాండ్‌ చేస్తోందట కృతిసనన్.
'మిమి' సినిమాతో కృతి సనన్‌ కెరీర్‌ కంప్లీట్‌గా మారిపోయింది. సరోగసి మథర్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమాలో కృతి పెర్ఫామెన్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బరువైన పాత్రని చాలా బాధ్యతగా చేసిందనే కాంప్లిమెంట్స్‌ వచ్చాయి. ఇక ఈ ప్రశంసలతో కృతి సనన్‌ కెరీర్‌కి బూస్టప్‌ వచ్చింది. కృతి సనన్‌ కూడా ఊహించని విధంగా 'ఆదిపురుష్'లో అవకాశం వచ్చింది. వాల్మీకి రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న 'ఆదిపురుష్'లో సీత పాత్ర పోషిస్తోంది కృతి. లార్జ్ స్కేల్‌లో మల్టీలింగ్వల్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
కృతి సనన్‌ 'మిమి' సక్సెస్ 'ఆదిపురుష్' ఆఫర్‌తో క్లౌడ్‌ నైన్‌లో ఉంది. బాలీవుడ్ జనాలు కూడా ఈమె కాల్షీట్స్‌ కోసం పోటీ పడుతున్నారు. దీంతో కృతి కూడా రెమ్యూనరేషన్‌ పెంచేసిందట. హైప్స్‌ని క్యాచ్ చేసుకుంటూ ఒక్కో సినిమాకి 10 కోట్లు డిమాండ్ చేస్తోందట కృతి.
కృతిసనన్ లో ఇంత మార్పు రావడంపై బాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. ఒక క్యారెక్టర్ డిమాండ్ చేస్తే.. ఇంతలా మారిపోయిందని మాట్లాడుకుంటున్నారు. ఏకంగా 10కోట్లంటే మాటలా అని ఆశ్చర్యపోతున్నారు. మిమి చిత్రం ద్వారా విమర్శల ప్రశంసలు అందుకుంది ఈ అమ్మడు. అందులో సరోగసి పాత్రలో ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇక ప్రభాస్ తో ఆదిపురుష్ చేస్తున్న కృతి పరిస్థితులే మారిపోయాయి. సీతగా నటిస్తుండటంతో ఆమె ఊహల్లో తేలుతోంది. భారీగా రెమ్యునరేషన్ పెంచేసి నిర్మాతలను డిమాండ్ చేస్తోంది. చూద్దాం.. కృతిసనన్ ఇదే జోరు కొనసాగిస్తుందో. లేక ముందుముందు మారుతుందో. పరిస్థితులు ఆమెను ఎలా మారుస్తాయో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: