నాటు నాటు పాటపై రచ్చ మాములుగా లేదుగా...?

murali krishna
దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ ( రణం రౌద్రం రుధిరం ).. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు గొప్ప వీరులను కలిపి చూపించే ప్రయత్నమే ఆర్ఆర్ఆర్ అని అందరికి తెలుసు .
ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ మరియు గిరిజన వీరుడు కొమురం భీమ్ గా తారక్ కనిపించనున్నారని సమాచారం.. అలాగే వీరిద్దరికి జోడిగా బాలీవుడ్ బ్యూటీ అయిన అలియా భట్.. హలీవుడ్ భామా అయిన ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ అయిన అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది.. ఈీ సినిమా కోసం యావత్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారని  ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ హైప్ క్రియేట్ చేశాయని తెలుస్తుంది.తాజాగా విడుదలైన నాటు నాటు వీర నాటు సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ సృష్టిస్తోందని సమాచారం.
తారక్- చెర్రీ మెరుపు లాంటి డ్యాన్స్ మూమెంట్స్, అదరగొట్టే కీరవాణి ట్యూన్లు కూడా జక్కన్న మేకింగ్ వ్యాల్యూస్ అన్నీ కలిపి నాటునాటు పాటను ఆన్‌లైన్‌లో ఆల్‌రౌండర్ పాటగా మార్చేశాయని తెలుస్తుంది.. నేషనల్‌ లెవల్లో ట్రెండ్ అవుతోందీ పాట. కాకపోతే చంద్రబోస్ రాసిన తెలుగు వెర్షన్‌లో ఆ లిరిక్స్ మీద కొన్ని చురకలు తప్పడం లేదని సమాచారం..
పశువుల దాణాక్కూడా పనికిరాని ఎర్రజొన్నలతో రొట్టెలేంటి పైగా అందులో మిరపతొక్క ఏమిటి … ఏంటి చంద్రబోసూ రాసే ముందు చూసుకోవద్ద అని చురకలంటిస్తున్నారని తెలుస్తుంది.. కీసుపిట్ట కూసినట్టు అంటున్నారు కీసుపిట్ట అంటే విజిల్ అని తెలుసుగా మీకు దానికై అదే ఎలా కూస్తుంది చెప్పండి అంటూ ప్రశ్నిస్తున్నారని సమాచారం.
వీరంగం వేస్తారు గాని సేయరు కదా పదాల్ని అన్వయించేముందే వాటి పరమార్థాలు తెలుసుకుని ముందుకెళితే బాగుండేది అనేది నెటిజన్లు విమర్శిస్తున్నారట.సీనియర్ మోస్ట్ రైటర్‌గా పేరున్న చంద్రబోస్‌ ఈమాత్రం జాగ్రత్తలు తీసుకుని వుంటే ఇలాంటి విమర్శలకు చోటుండేది కాదేమో అని అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: