హాట్ బ్యూటీ నడుముపై చపాతీలు కలుద్దాం అనుకున్నారట..!

Pulgam Srinivas
బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షేరావత్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మర్డర్, ఖ్వైష్ వంటి పలు సినిమాలలో తన అంద చందాల తో, గ్లామర్ తో ఎంతో మంది అభిమానులను అలరించిన మల్లికా షేరావత్ కేవలం బాలీవుడ్ సినిమాలలో మాత్రమే కాకుండా ఇంగ్లీష్, చైనీస్ భాషల సినిమాల్లో కూడా నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. ఇలా సినిమాలతో అలరించిన మల్లికా షేరావత్ ప్రస్తుతం వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అయితే తాజా గా మల్లికా షేరావత్ ఒక లైవ్ షో లో మాట్లాడుతూ తనకు సినిమా ఇండస్ట్రీలో ఎదురైనా కొన్ని ఆసక్తికరమైన అనుభవాల గురించి తెలియజేసింది
 ది లవ్ లాఫ్ లైవ్ షో' లైవ్ షో లో పాల్గొన్న మల్లికా షేరావత్ మాట్లాడుతూ... ఒక మూవీ షూటింగ్ సమయంలో నిర్మాత తో తనకు ఎదురైన విచిత్రమైన అనుభవాన్ని మల్లికా శెరావత్ తెలియజేశారు. ఒక సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు మల్లికా నడుము మీద చపాతీలు కాల్చే సన్నివేశాన్ని తీయాలని చిత్ర నిర్మాత డిమాండ్ చేశారట. దానికి షాక్ అయిన మల్లికా షేరావత్ వెంటనే ఆ సీన్ చేయడానికి నిరాకరించినట్లు తెలియజేశారు.

మల్లికా షేరావత్ మాట్లాడుతూ... సాంగ్ షూటింగ్ సమయంలో నిర్మాత తన వద్దకు వచ్చి, ఇది చాలా హాట్ సాంగ్. మీరు హాట్ గా ఉన్నారని ప్రేక్షకులకు ఎలా తెలుస్తుంది..? అందు కోసమే మీరు చాలా వేడిగా ఉన్నారని ప్రేక్షకుడికి అర్ధమయ్యేలా మీ నడుము పై చపాతీ కాలుస్తారని అన్నాడు'' అని చెప్పింది. నిర్మాత చేసిన వింత డిమాండ్ ను తాను నెరవేర్చడానికి నిరాకరించానని, కాకపోతే అది చాలా ఫన్నీ ఐడియా అని తర్వాత అనుకున్నాను అంటూ మల్లికా షేరావత్ తెలియజేసింది. ఇలా మల్లికా షేరావత్ ఈ లైవ్ షో లో మాట్లాడుతూ అనేక విషయాలను తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: