ప్రభాస్ తో సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన మారుతి..!

Pulgam Srinivas
దర్శకుడు మారుతి ఈ రోజుల్లో లాంటి ఒక చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు, ఈ సినిమా విడుదలకు ముందు ఏలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా సినిమా విడుదల తర్వాత మాత్రం ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి ప్రశంసలు పొంది ఈ రోజుల్లో సినిమా మంచి విజయంగా నిలిచింది. ఇలా మొదటి సినిమా తోనే దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న మారుతి, ఆ తర్వాత బస్టాప్, బలే బలే మగాడివోయ్, బాబు బంగారం, మహానుభావుడు, ప్రతి రోజు పండగే లాంటి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి దర్శకుడిగా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే మారుతి కొన్ని రోజుల క్రితం గోపీచంద్ హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా పక్కా కమర్షియల్ సినిమా ప్రారంభించాడు.

 
కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత దేశంలో కరోనా విజృంభించడంతో ఆ సినిమాని పక్కన పెట్టి సంతోష్ శోభన్ హీరోగా మెహరీన్ హీరోయిన్ గా మంచి రోజులు వచ్చాయి అని ఒక చిన్న సినిమాను అతి తక్కువ వ్యవధిలో తెరకెక్కించి ఈ మధ్యే విడుదల కూడా చేశాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మారుతి చిరంజీవి కి  ఒక స్టోరీ చెప్పినట్టు, ఆ లైన్ బాగా నచ్చిన చిరంజీవి ఆ కథను డెవలప్ చేయమని చెప్పినట్లు తెలియజేశాడు. అయితే ప్రస్తుతం మారుతి యూవి క్రియేషన్స్ బ్యానర్ లో పక్కా కమర్షియల్ సినిమా చేయడంతో ప్రభాస్ కు కూడా మారుతి ఒక కథను మారుతీ వినిపించినట్టు యూవి క్రియేషన్స్ బ్యానర్ వారే ఆ సినిమాను కూడా నిర్మించనున్నట్లు కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన మారుతి నేను ప్రభాస్ కు ఎలాంటి కథ వినిపించలేదు. కానీ ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం వస్తే మాత్రం కచ్చితంగా చేస్తాను అని మారుతి తెలియజేశాడు. ఇది ఇలా ఉంటే మారుతి ప్రస్తుతం పక్కా కమర్షియల్ సినిమాను పూర్తి చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: