వింత వింత ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొడుతున్న అనుపమ..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ అనుపమ పరమేశ్వరన్ మలయాళం ప్రేమమ్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది, ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మకు తెలుగు ఇండస్ట్రీ నుండి కూడా మంచి ఆఫర్లు వచ్చాయి. అందులో భాగంగా నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అ ఆ సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ సినిమా లో పల్లెటూరి అమ్మాయిల చేసిన నటనకు తెలుగు ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. అలా తెలుగు నాట మంచి క్రేజ్ ను సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్ ఫుల్  క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అందులో భాగంగా అనుపమ పరమేశ్వరన్ హలో గురు ప్రేమకోసమే, ఉన్నది ఒకటే జిందగీ, శతమానం భవతి వంటి పలు తెలుగు సినిమాల్లో నటించి తెలుగు నాట ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది.

ప్రస్తుతం కూడా అనుపమ పరమేశ్వరన్ 18 పేజీస్, కార్తికేయ 2 , రౌడీ బాయ్స్ వంటి పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇలా వరుస సినిమా లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన అంద చందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియాలో అకౌంట్ లో అప్లోడ్ చేస్తూ ఉండే అనుపమ పరమేశ్వరన్ తాజా గా కూడా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అనుపమ పరమేశ్వరన్ పోస్ట్ చేసిన ఈ ఫోటోలలో నవ్వుతూ, వెక్కిరిస్తూ ఇలా అనేక రకాల స్టిల్స్ తో జనాలను అలరిస్తోంది. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: