తమిళ్లోనే కాదు.. తెలుగులో కూడా స్టార్ హీరోనే?

praveen
ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ఒక పెద్ద ఇండస్ట్రీ గానే కొనసాగుతోంది. కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు అటు టాలీవుడ్ ప్రేక్షకుల మనసు కూడా పెద్దది. ఎందుకంటే సినిమా బాగుండాలి కానీ హీరో ఎవరు అని కూడా చూడరు టాలీవుడ్ ప్రేక్షకులు. కేవలం తెలుగు హీరోలను మాత్రమే కాదు అదే రీతిలో తమిళ హీరో లను కూడా ఆదరిస్తూ తమ గొప్ప మనసు చాటుకుంటున్నారు తెలుగు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వైపు తెలుగు హీరోలు స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. మరోవైపు తమిళ కన్నడ హీరోలు కూడా తమ సినిమాలను తెలుగులో డబ్ చేస్తూ ఇక్కడ స్టార్ హీరో రేంజ్ ను సంపాదిస్తున్నారు.

 ఇలా ఎన్నో ఏళ్ల నుంచి అటు తమిళ హీరోలు అందరూ తాము నటించిన సినిమాలన్నీ కూడా తెలుగులో విడుదల చేస్తూ ఉండటం గమనార్హం. ఇలా తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకర్షించి టాలీవుడ్లో కూడా స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు హీరో సూర్య. హీరో సూర్య కి తమిళ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అయితే ఆ తర్వాత తన సినిమాలను తెలుగులో కూడా విడుదల చేయడం మొదలుపెట్టాడు. తెలుగు ప్రేక్షకులను కూడా సూర్య సినిమాలు బాగా ఆకర్షించాయి. ముఖ్యంగా సూర్య హీరోగా నటించిన గజిని సినిమా తెలుగు ప్రేక్షకులందరికీ బాగా కనెక్ట్ అయ్యింది. ఇక ఆ తర్వాత సూర్య సినిమాలన్నీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే  తమిళంలోనే కాదు సూర్య నటించిన సినిమాలు తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా సూర్య నటించిన సింగం సినిమా అయితే తెలుగు ప్రేక్షకులందరికీ సూర్య ని మరింత దగ్గర చేసింది.

 ఇక సూర్య తన నటన తోనే కాదు తన పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ లతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులందరూ తమిళ హీరో సూర్య ను తెలుగు హీరో లాగానే భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సూర్య ఏ సినిమాలో నటించిన కూడా తెలుగుహీరోలను ఆదరించినట్లు గానే సూర్య ని కూడా ఆదరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అటు సూర్య కూడా ప్రస్తుతం తాను నటించిన అన్ని సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తూ ఉండటం గమనార్హం. ఇలా తమిళ్ లో స్టార్ హీరో గా ఉన్న సూర్య తెలుగు లో కూడా తన సినిమాలతో స్టార్ హీరో రేంజ్ సంపాదించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: