దీపికా పదుకొనే గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు..!!

Divya
2000 వ సంవత్సరంలో ఈమె అసలు హీరోయినా.. ఇంత నల్లగా ఉంది అంటూ కామెంట్ చేశారు. కానీ ఒంట్లో కాసింత కండ కూడా లేదు ఈమె హీరోయిన్ అంటే ఎలా అని సినీ ఇండస్ట్రీ లో ఉండే కొంతమంది ఈమెను కామెంట్ చేశారు.2017 వ సంవత్సరానికి వచ్చే సరికి ఈమె మా సినిమాలో హీరోయిన్ గా కచ్చితంగా నటించాలని డైరెక్టర్లు వెంట పడ్డారట. పారితోషికం ఎంతైనా పర్వాలేదు ఈమె డేట్లు ఖాళీ ఉన్నప్పుడు వస్తే చాలు అనే స్థాయికి ఎదిగింది దీపికా పదుకొనే. ఇక ఈమె గురించి కొన్ని విషయాలు చూద్దాం.
దీపికా పదుకొనే జన్మించింది డెన్మార్క్ . ఈమె తండ్రి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పదుకొనే. ఈమె 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు కుటుంబం మొత్తం బెంగళూరులో స్థిరపడింది. ఇక తండ్రి మాదిరే దీపికా కూడా అథ్లెట్.జాతీయస్థాయి ఛాంపియన్ షిప్ పోటీల్లో కూడా పాల్గొనేది.చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే దీపికా పదుకొనే బ్యాడ్మింటన్ ప్లేయర్ మాత్రమే కాదు.. రాష్ట్రస్థాయి బేస్ బాల్ క్రీడాకారిణి కూడా.
కానీ మోడలింగ్ పై ఆసక్తి గా ఉండడంతో క్రీడలకు బై బై చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. అలా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది దీపికా పడుకొనే. అలా ఎన్నో యాడ్స్ లో నటించింది. కానీ ఈమెకు పేరు తెచ్చింది మాత్రం"లిరిల్ ఆరంజర్"దీంతో ఈ ముద్దుగుమ్మ ఓవర్నైట్ కి పాపులర్ అయింది. కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో ఈమె స్థానం దక్కించుకుంది.
2005 లో మోడల్ ఆఫ్ ది ఇయర్ గా అవార్డును సొంతం చేసుకుంది. ఆ తర్వాత దీపిక సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది "ఐశ్వర్య" అనే కన్నడ చిత్రం ద్వారా. ఇక ఆ తర్వాత షారుఖ్ ఖాన్ తో కలిసి"ఓం శాంతి ఓం"అనే సినిమాలో నటించింది ఈ సినిమా మంచి బ్లాక్ బాస్టర్ హిట్టు సంపాదించుకుంది. ఇక ఈ సినిమాతో ఈమె ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును కూడా సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: