బిగ్ బాస్ తెలుగు 5: హౌస్ లో ఎవరిని ఎవరు టార్గెట్ చేస్తున్నారంటే ??

Surya
తెలుగు బిగ్ సీజన్ 5 అనూహ్యంగా పుంజుకుని టీవీ షో లన్నింటిలో మంచి రేటింగ్స్ తో ముందుకు దూసుకు పోతు వుంది. నాగార్జున హోస్టింగ్ బిగ్ బాస్ కి పెద్ద మైలురాయి . హౌస్ ఇప్పటివరకు ఎనిమిది మంది ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. చివరిగా లోబో ఇంటినుండి బయటకు వచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఆటగాళ్లు ఎత్తులకు పై ఎత్తులు వేసి ప్రత్యర్థులను చిత్తూ చిత్తూ చేస్తున్నారు. హౌస్ లో ఉన్న 11 మంది కంటెస్టెంట్స్ మధ్య గట్టి పోటీ ఏర్పడింది. ఈ వరం ఇంటినుండి బయటకు వచ్చే ఇంటిసభ్యుల జాబితాలో షణ్ముఖ్ తప్పించి అందరూ నామినెటే అయ్యారు.  హౌస్ లో ఇప్పటికే గ్రూపులుగా ఏర్పడ్డారు. షణ్ముఖ్ , సిరి మరియు జస్వంత్ లు ముగ్గురు ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఆటను ఆడుతున్నారు.


 వీరికి ఇప్పటికే త్రిమూర్తులు అనే పేరుకూడా పెట్టేసారు. ఇకపోతే సన్నీ , మానస్ మరియు కాజల్ లు ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యారు. అయితే సన్నీ ఆవేశంలో మానస్ సేఫ్ గేమ్ ఆడుతున్నడని హౌస్ మేట్స్ అభిప్రాయం. మిగిలిన హౌస్ మేట్స్   రవి , యాని , శ్రీరామ చంద్ర , విశ్వ లు తప్పని పరిస్థితులలో ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యారు ఇక పోతే పింకీ అలియాస్ ప్రియాంక అన్ని గ్రూపుల్లో ఉంటూనే ఒంటరిగా గేమ్ ప్లే చేస్తుంది. ఐతే హౌస్ లో ఎవరిని ఎవరు టార్గెట్ చేస్తున్నారో తెలుసుకుందాం...ముఖ్యంగా కాజల్ గురించి చెప్పుకోవాలి హౌస్ లోకి వచ్చిననాటి నుండి కూడా రవిని టార్గెట్ చేస్తూనే వుంది. అవకాశం దొరికితే చాలు రవి ని ఎలా హైలెట్ చేయాలో ఆలోచిస్తూ ఉంటుంది.


 అయితే రవి ని టార్గెట్ చేసేవారిలో ముఖ్యంగా కాజల్ , షణ్ముఖ్ , జస్వంత్ మరియు మానస్ లు ఉన్నారు , సన్నీ రవిని టార్గెట్ చేస్తున్నప్పటికీ అంతగా బయటపడటం లేదు. ఈ రకంగా చూసుకుంటే అందరూ కూడా రవిని గట్టి పోటీదారుడుగా భావిస్తున్నారు అందుకనే రవిని నెగటివ్ వే లో ప్రేక్షకులకు చూపిస్తున్నారు. సన్నీ టార్గెట్ చేసేవారిలో ముఖ్యంగా  త్రిమూర్తులు వుంటారు. మరి జస్వంత్ ని టార్గెట్ చేసేవారిలో ముఖ్యంగా రవి , సన్నీ , విశ్వ లు ముందుంటారు. విశ్వా ని టార్గెట్ చేసేవారిలో పింకీ తప్పకుండా ఉంటుంది. మానస్ ని శ్రీరామచంద్ర ..శ్రీరామ చంద్ర ని మానస్ ఎప్పుడూ టార్గెట్ చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే కాజల్ ని యాని , సిరి ఎప్పుడూ నామినెటే చేసుకుంటూ వుంటారు. బిగ్ బాస్ హౌస్ లో ఎవ్వరికీ వారు  నటిస్తున్నప్పటికీ వారిలో  ఉన్న మరోకోణం ప్రేక్షకులకు యిట్టె తెలిసిపోతూవుంటుంది  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: