ఆ హీరో కోసం కీర్తీ సురేష్ తో పోటీ పడుతున్న సమంత..?

Anilkumar
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత ఇటీవలే భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.తన విడాకుల వరుసగా సినిమాలకు ఒప్పుకుంటూ దూసుకుపోతున్న ఈ అమ్మడు విడాకుల తర్వాత కెరియర్ పైన ఫోకస్ బాగా పెట్టింది. ఈ క్రమంలోనే నాచురల్ స్టార్ నాని కోసం కీర్తి సురేష్ తో పోటీ పడడానికి  సిద్ధపడింది. ఇక వివరాల్లోకి వస్తే..... నాచురల్ స్టార్ నాని 'దసరా' అనే టైటిల్ తో ఒక సినిమాని దసరా పండుగ రోజున ప్రకటించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో రాబోతున్న ఈ సినిమా సుధాకర్ చేకూరి నిర్మిస్తున్నారని సమాచారం.

 మాస్ ఎంటర్టైనర్ గా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతోంది. ఇది ఇలా ఉండగా ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఈ సినిమాలో కీర్తి సురేష్ కి పోటీగా మరో హీరోయిన్ కూడా కనిపించబోతుంది. ఆ హీరోయిన్ పాత్రలోనే సమంత నటిస్తోందట.ఈ విషయంపై ఇప్పటికే సమంతతో సంప్రదింపులు అయిపోయాయని ఒక టాక్ నడుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమా అనేది అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉండగా ఇప్పటికే సమంత నానితో ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు అనే సినిమాలో నటించింది.

 ఇప్పటివరకు వచ్చిన సమాచారం నిజమే అయితే వీరి జోడీ ముచ్చటగా మూడో తెరపై కనిపించనుంది. ఇక సమంత ఇటీవలే గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' సినిమా షూటింగ్ ని పూర్తి చేసిన విషయం తెలిసిందే. భారీ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత లీడ్ రోల్ పోషిస్తోంది. అంతేకాదు ఈ సినిమాతోనే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా వెండితెర ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక ఈ సినిమాతో పాటు ఇటీవలే సమంత ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చైతూతో విడాకుల తర్వాత సమంత మాత్రం సినిమాల విషయంలో తన జోరు పెంచిందనే చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: