మణిరత్నం 'మౌనరాగ'మే ఈ రేవతి

Vennelakanti Sreedhar
మణిరత్నం 'మౌనరాగ'మే ఈ రేవతి
 విఖ్యాత దర్శకుడు  మణిరత్నం  పేరు చెప్పగానే  ఠక్కున గుర్తుకు వస్తుంది  అక్కినేని  నాగార్జన నటించిన 'గీతాంజలి'... అంతే కాదు ఆయన దర్శకత్వంలో విరబూసిన .. '
రోజా'... మరింత ఎదిగన  'నాయకుడు' కనిపిస్తారు. ఆయన తీసిన ఎన్నో చిత్రాలు తెలుగుప్రేక్షకులకు చిరపరిచితాలు. ఆయన మౌనంగా ఆలపించి చిత్రమే  'మౌనరాగం'.హీరోయిన్ నటి రేవతి. ఇది డబ్బింగ్ చిత్రమైన ఆ సినిమా అందరి మన్ననలూ అందుకుంది. ఈ సినిమా హీరోయిన్ తాజా తెలుగు చిత్రం,  సందేశాత్మక చిత్రంలో ప్రధానా పాత్ర పోషిస్తున్నారు.  'ఇట్లు  అమ్మ' ఈమె తాజా చిత్రం.  'మౌనరాగం' చిత్రంలో అల్లరి పిల్లలా  ఆకట్టుకున్న నటి  రేవతి.  కళ్ళతోనే కోటి భావాలు పలికించే నటిగా పేరు  తెచ్చుకున్నారు. పరభాషా నటులకు ఆదరించిన తెలుగు చిత్రి సీమ ఈమెనూ ఆద రించి అక్కన చేర్చుకున్నరేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ‘మానసవీణ’ చిత్రంతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టారీమే.  నటి రేవతి మాతృభాష మళయాళం. వాస్తవానికి ఈమె  రంగస్థల నటి.  అంతకు ముందే నాట్య ప్రదర్శనలిచ్చారు. భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన ‘మణ్ వాసనై’ తమిళ చిత్రం ఈమెకు మంచి నటిగా గుర్తింపు నిచ్చింది. తెలుగులో సినీ రంగంలో  ప్రఖ్యాత దర్శకుడు బాపు గీచిన బొమ్మల్లో ఈమె కూడా ఒకరు. ఆయన  తెరకెక్కించిన  'సీతమ్మ పెళ్లి'  చిత్రం నటిగా రేవతికి మంచి పేరు తెచ్చింది. అయితే చాలా అనువాద చిత్రాలతో ఆమె తెలుపు ప్రేక్షకులకు చిరపరిచితురాలయ్యారు. అక్కినేని నాగేశ్వ రావు నటించిన 'రావుగారిల్లు'  చిత్రంతో తెలుగువారికి దగ్గరైన నటి రేవతి.  తెలుగు సినీ4ీ హీరో వెంకటేష్  సరసన 'ప్రేమ' చిత్రంలో ఆమె నటన అందరి మన్ననలు అందుకుంది. ఈ చిత్రం చాలా హిట్టయింది కూడా. అంతే కాదు పలు భాషల్లో ప్రేమ చిత్రాన్ని మరలా నిర్మించారు. అన్నింటి లోనూ ఆమే హీరోయిన్. మణిరత్నం తీసిన మౌన రాగం చిత్రం దక్షిణ భారత దేశంలో ఆమెకు మంచి పేరు తేచ్చిపెట్టింది.
తెలుగులో ఆమె నటించిన 'అంకురం'  సినిమాకు ఫిలింఫేర్ అవార్డు ను అందుకున్నారు. రాంగోపాల్ వర్మ    'గాయం' చిత్రంలో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది. బహుబాషా నటి అయిన అమె ప్రభాస్  తోలి చిత్రం 'ఈశ్వర్' లోనూ క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్ర పోషించారు. ఆ తరువాత చాలా కాలం తెలుగు సినిమాకు దూరమయ్యారు.  వివిధ భాషల్లో  తల్లిగా, అత్తగారిగా పాత్రలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు.  తాజాగా 'ఇట్లు అమ్మ' తేలుగు  చిత్రంలో నటించారు.
 నటి రేవతి దర్శకురాలు కూడా.  శోభన ప్రధాన పాత్రలో ఈమె దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘మిత్ర్, మై ఫ్రెండ్’ . ఇది ఆంగ్ల చిత్రం కావడం   విశేషం. ఈ  సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిలిమ్ ఇన్ ఇంగ్లిష్ కేటగిరీలో  జాతీయ అవార్డు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: