"కొండపొలం" టైటిల్ పై రచ్చ రచ్చ..?

NAGARJUNA NAKKA
మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఉప్పెన సినిమా ఆయన కెరియర్ ను కీలక మలుపు తిప్పేసింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో వైష్ణవ్ తేజ్ కు కూడా అభిమానులు పెరిగిపోయారు. మేనమామకు తగ్గ అల్లుడే అంటూ ప్రశంసలు కురిపించారు. ఉప్పెన సినిమా తర్వాత మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన సినిమా కొండపొలం. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించాడు. కరోనా ఒకవైపు అల్లకల్లోలం సృష్టిస్తున్నా.. ఈ సినిమా షూటింగ్ మాత్రం ప్రశాంతంగా ముగిసింది. వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటన అదిరిపోయింది. ఈ చిత్రంలో అన్నపూర్ణ, కోటా శ్రీనివాసరావు, రచ్చ రవి ఇతర నటులు కీలక పాత్ర పోషించారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి చేతులమీదుగా జాలు వారిన కొండపొలం నవలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను వెండితెరకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అక్టోబర్ 8న కొండపొలం విడుదలైన ఈ సినిమా వివాదాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. హీరో పేరులో యాదవ్ ను పొందుపరచడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కురుమ కులవృత్తి ఆధారంగా తీసిన ఈ సినిమాలో యాదవ్ అని ఎలా పెడతారని కురుమ సంఘాలు ప్రశ్నించాయి.
కొండపొలం చిత్రంలో కురుమలు ఎదుర్కొంటున్న సమస్యలను బాగా చూపించారనే విషయంలో ట్రైలర్ లో స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో హీరో పేరు కటారు రవీంద్ర యాదవ్. ఈ పేరును తీవ్రంగా వ్యతిరేకించాయి కురుమ సంఘాలు. యాదవులు గొర్రెలు, మేకలు, గేదెలే కాకుండా ఇతర పశువులను మేపుతారు. అదే కురుమలు అయితే గొర్రెలు మాత్రమే కాస్తారనే విషయాన్ని స్పష్టం చేశారు.
గొల్లలు లేదా యాదవులు బీసీ- డీ కిందకు వస్తే.. కురమలు బీసీ-బీ కిందకు వస్తారు. అంటే యాదవుల కంటే కురుమలు ఇంకా వెనుకబడిన వారి కిందకు వస్తారు. తమ పేరు చివరన కురుమ అని పెట్టుకుంటామని స్పష్టం చేశారు. యాదవుల కులదైవం మల్లన్న అనీ.. కురుమల ఇలవేర్పు బీరప్ప అని తెలియజేశారు. కురుమల మనోభావాలను దెబ్బతీసేలా కొండపొలం ఉందంటూ మండిపడ్డారు. వెంటనే హీరో పేరును మార్చాలని డిమాండ్ చేశారు. యాదవ్ పేరును తీసివేసినా తమకు అభ్యంతరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: