బిగ్ బాస్ తెలుగు 5: ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేది లోబో నా లేక.. !!

Surya
తెలుగు బిగ్ బాస్ సీజన్ ౫.. టాప్ రేటింగ్స్ తో అనూహ్యంగా దూసుకుపోతూవుంది. నేటితో బిగ్ బాస్ సీజన్ 5 విజయవంతంగా ఎనిమిది వారలు పూర్తి చేసుకుంటుంది . అయితే ఈ వారం ఇంటి నుండి బయటకు వచ్చే ఇంటి సభ్యుల జాబితాలో లోబో , సిరి హన్మంత్ , రవి, శ్రీ రామ చంద్ర , జస్వంత్ , షణ్ముఖ్ మరియు మానస్ లు ఉన్నారు. వీరిలో రవి , షణ్ముఖ్ , శ్రీరామచంద్ర , జస్వంత్ లకు భారీగా ఓట్స్ పోల్ అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం వారికీ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉండడమే. ఈ పరంగా వారికీ ఎటువంటి గండం లేనట్లే. ఎటొచ్చి లోబో మరియు సిరి హన్మంత్ లకు తక్కువుగా ఓట్స్ పోల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరిలో సిరికి కాస్త బెట్టారు గా ఓట్స్ పోల్ అవుతున్నాయి. 


మొత్తానికి లోబో ఈ వారం ఇంటినుండి బయటకు రాక తప్పదనిపిస్తోంది. ఆరవ వారం ఎలిమినేషన్లో శ్వేతా వర్మ స్తానం లో రోబో ఎలిమినేట్ అవ్వవలసి వుంది కానీ ఇంటి సభ్యులు అందరు కలసి ఇంటినుండి బయటకువెళ్ళే సభ్యున్ని డైరెక్టుగా ఎన్నుకున్న టాస్క్ లో లోబో అనూహ్యంగా బయటకు వచ్చి ఎలిమినేషన్ నుండి సేఫ్ అయ్యాడు. ఆరవ వారంలో శ్వేతా కు బదులుగా లోబో కచ్చితంగా ఎలిమినేట్ అయ్యివుండేవాడు. అతడికి కాలం కలసి రావడంతో సేఫ్ అయ్యాడు. ఈ వారం మాత్రం అతడిని సేఫ్ చేయడానికి బిగ్ బాస్ దగ్గర ఎటువంటి ఉపాయం లేకపోయి వుండవచ్చూ. అయితే ఇప్పటికే ఆరుగురు లేడీ కంటెస్టెంట్స్ ని హోసే నుండి బయటకు తీసుకువచ్చింది దింతో అమ్మాయిలు బిగ్ బాస్ విన్నర్లు కాకూడని బిగ్ బాస్ ఇదంతా చేస్తున్నాడని సర్వత్రా విమర్శలు వినిపించాయి. అందుకోసమైనా ఇక లోబోను ఎలిమినేషన్ కి పంపక తప్పదు. సిరి ఇప్పటికే ఆమె లో ఉన్న అన్ని కళలను బయటకు తీసుకువచ్చి అందరిని కాస్తో కూస్తో ఎంటర్టైన్మెంట్ చేస్తూవుంది ముఖ్యంగా షణ్ముఖ్ ని . లోబో మాత్రం ఒకటి రెండు టాస్క్ లలో మాత్రమే ఎంటర్టైన్మెంట్ చేశాడు.  సీక్రేట్ రూంలోకి వెళ్లివచ్చిన తరువాత లోబో అట కాస్త డల్ అనిపిస్తుందన్న మాట వాస్తవం. ఈ వారం ఎలిమినేషన్ లోబో కి అంతగా కలసిరాకపోవచ్చు. ఈ ఆదివారం దివాలి సందర్భంగా బిగ్ బాస్ షో కాస్త ముందుగానే మొదలు కాబోతుంది. ఈ సారి బిగ్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఓ రేంజ్ లో ఉండబోతుంది. దసరా పండగ కు ఆది హౌస్ ని ఎంటర్టైన్మెంట్ లో ముంచెత్తాడు అయితే ఈ వారం మళ్లీ హౌస్ లోకి ఆది ఎంట్రీ ఉండబోతుందని సమాచారం      

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: