"ఆదిపురుష్" సినిమాకు అదొక్కటే మైనస్... ?

VAMSI
మాములుగా టాలీవుడ్ దర్శక నిర్మాతలు బాలీవుడ్ నుండి హీరోయిన్ లను దిగుమతి చేసుకుంటూ ఉంటారు. అది కూడా మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమాలకు హీరోయిన్ కొత్త ముఖం అయితే బాగుంటుందని కొన్ని సమయాలలో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కానీ అవి కొన్ని సార్లు సక్సెస్ అవుతుంటాయి. మరి కొన్ని సార్లు బెడిసి కొడతాయి. అయితే పరభాషా హీరోయిన్ ఒక్క సినిమాలో వర్క్ ఔట్ కాకపోతే మళ్ళీ సినిమాల్లో చేయడానికి ఎవరూ సాహసం చేయరు. కానీ మన టాలీవుడ్ లో మాత్రం అలా చేశారు. మరి ఆ హీరోయిన్ ఎవరు ఏ సినిమాలో అనేది ఒకసారి చూద్దాం. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మొదటి సారిగా సుకుమార్ తో కలిసి పని చేశారు. సుకుమార్ కూడా మంచి కాన్సెప్ట్ ను ఎంచుకున్నారు. అదే "నేనొక్కడినే". ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ కృతి సనన్ ను తీసుకున్నారు.
ఈ సినిమాలో కొంచెం హీరోయిన్ ప్రాధాన్యత ఉండడంతో కొత్త ఫేస్ ఉండాలని ఇలా చేశారు. ఇందులో కృతి నటన బాగున్నా  సినిమా ప్లాప్ అయ్యింది. మాములుగా సినిమా ప్లాప్ అయితే ఆ ఎఫెక్ట్ అందరిమీదా పడుతుంది. ముఖ్యంగా హీరోయిన్ ను ఐరన్ లెగ్ అని వివిధ పేర్లు పెడుతూ ముందు సినిమాల్లో వారిని తీసుకోవాలంటే వెనుకడుగు వేస్తుంటారు. కానీ ఆశ్చర్యకరంగా మళ్లీ వేరే సినిమాలో అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. నాగచైతన్య హీరోగా చేసిన "దోచేయ్" సినిమాతో మళ్లీ రెండవ సారి టాలీవుడ్ లో మూవీ చేసింది కృతి సనన్. అయితే నాగ చైతన్య కూడా ఈమె ఫేట్ ను మార్చలేకపోయాడు. ఈ సినిమా ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ రెండు ప్లాప్ లతో కృతి సనన్ పై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది.
అయితే అప్పుడే ఈమె గురించి అందరూ మరిచిపోయారు. కానీ ఇప్పుడు మళ్లీ ఈమె గురించి చర్చలు మొదలయ్యాయి. ఎందుకో తెలుసా, మన టాలీవుడ్ డార్లింగ్ హీరో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వరుస పెట్టి సినిమాలను చేస్తున్నాడు. అందులో ఒక సినిమా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ఆదిపురుష్ ను తెరకెక్కిస్తున్నాడు.  ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ మొదటి సారి ఇలాంటి పాత్రను పోషిస్తున్నాడు. ఇందులో కృతి సనన్ ప్రభాస్ కు జోడీగా సీత పాత్రను చేస్తోంది. అయితే ఈ సినిమా అన్ని భాషల్లోనూ విడుదల కానుంది. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ కు తలనొప్పిగా మారింది. ఇప్పటికీ ఈమె తెలుగులో చేసిన రెండు సినిమాలు ప్లాప్ లు అయ్యాయి. అధిపురుష్ పరిస్థితి ఏమిటి అంటూ ఆలోచిస్తున్నారు. మరి వరుసగా మూడవ ప్లాప్ వస్తుందా ? లేదా ఈ సినిమాతో హిట్ కొట్టి తన పేరు టాలీవుడ్ లో తనపై ఉన్న ఐరన్ లీగ్ ముద్ర చెరిపి వేస్తుందా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: