BB5: ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేది ఆవిడేనా ??

Surya
దేశం లో బిగ్ బాస్ షో కి ఉన్న క్రేజు ఏ రియాలిటీ షోకి లేదంటే అతిశయోక్తి కాదేమో. ప్రస్తుతం బిగ్ బాస్ షో తెలుగులో 4 సీజన్లను పూర్తి చేసుకోగా ప్రస్తుతం 5వ సీజన్ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1  సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసారు. ఆతరువాత వచ్చిన నాని కూడా అలరించాడు. సీజన్ 3 ,4 లను నాగార్జున పూర్తి కొనసాగించారు . ప్రస్తుతం నడుస్తున్న సీజన్ 5  ని కూడా అక్కినేని నాగార్జున విజయవంతంగా నడిపిస్తున్నారు.  అయితే ప్రస్తుతం జరుగుతున్న సీజన్ 5 లో ఆరు వారలు పూర్తి చేసుకొని ఏడవ వారం లో ఉన్నాం.  అయితే హౌస్ లోకి 19 మంది కంటెస్టెంట్స్ రాగా ఆరుగురు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. 

ఎలిమినేట్ ఐన వారిలో సరయు , ఉమాదేవి, లహరి , నటరాజ్ మాస్టర్ , హమీద, శ్వేతా వర్మ ఉన్నారు. ప్రస్తుతం హౌస్ లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఆదివారం జరగబోయే ఎలిమినేషన్ ప్రక్రియ ప్రాధాన్యతను సంతరించు కుంది. బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఎన్నికైనవారిలో రవి , శ్రీరామచంద్ర , ప్రియా , యానీ ,సిరి , షన్ను, కాజల్ , జస్వంత్ లు నామినేట్ కాగా లోబో హౌస్ ఎలిమినేషన్ కారణంగా డైరెక్ట్ గా ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యాడు. అయితే  యానీ, లోబో , ప్రియా లకు తక్కువ ఓట్లు పోలయ్యాయని విశ్వసనీయమైన సమాచారం. యానీ , లోబో ల మధ్య గట్టి పోటీ నెలకొంది . వారిద్దరికీ ఓట్లు సమానంగా వచ్చాయి. అయితే లీస్ట్ లో ఉన్న ప్రియా ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఈమేరకు ఆన్లైన్ రచ్చ నడుస్తోంది.


 అయితే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో యానీ సన్నీ కి సపోర్ట్ చేస్తూ పిన్ ను సన్నీ కి  ఇచ్చి సన్నీని గెలిపించింది. అయితే సన్నీ కెప్టెన్సీ టాస్క్ గెలిచిన తరువాత యానీ మాస్టర్ కి ఇచ్చిన కిస్ ఇప్పుడు చేర్చనీయాంశం అయ్యింది. అయితే ఆరవ వారం లో లోబో సేక్రేట్ రూమ్ కి వెళ్లి ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నాడు. అయితే లోబో సీక్రెట్ రూమ్ నుండి వచ్చిన తరువాత అతడి గేమ్ ఎలా వుండబోతుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది . ఇకపోతే కెప్టెన్సీ టాస్క్ లో సన్నీ తో ప్రియా బిహేవియర్ ఆమెకు మైనస్ అయ్యిందనే చెప్పాలి. ఆ కారణంగానే ఆమెకు తక్కువ ఓట్లు పోల్ అయ్యాయనేది ప్రధాన వాదన. ఏదేమైనప్పటికీ గేమ్ తాళం బిగ్ బాస్ చేతిలోనే . గేమ్ ఏ టైం లో ఎలా ఉండబోతుందో ఎవరం ఊహించలేం.



 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: