వరుస పాన్ ఇండియా చిత్రాలతో డార్లింగ్ ఫుల్ బిజీ...

VAMSI
బాహుబలి వంటి సంచలన విజయం తర్వాత ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ పై అంచనాలు ఆకాశాన్ని దాటాయి. అందరూ ఆయన తదుపరి చిత్రాలపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ప్రభాస్ కూడా వరుసగా పాన్ ఇండియా చిత్రాలకు కమిట్ అవుతూ అంచనాలను మరింత పెంచారు. అయితే బాహుబలి తరువాత భారీ అంచనాల నడుమ విడుదలైన ప్రభాస్ మూవీ "సాహో" అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. దాంతో రెబల్ స్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లపై ఆసక్తి అంతకంతకూ పెరిగింది. ఈ చిత్రం నిరాశ మిగల్చడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ప్రత్యేక దృష్టి పెడతారని అన్ని కోణాలలో ఆలోచించి డార్లింగ్ కథలను సెలెక్టివ్ గా తీసుకుంటారని ఫ్యాన్స్ నమ్మకం ఉంచారు.
ప్రస్తుతం మనకు తెలిసిన సమాచారం మేరకు ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ విషయానికి వస్తే రాధే శ్యామ్ మూవీ సంక్రాంతి  బరిలో దిగేందుకు ముస్తాబవుతోంది. రాదా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా చేశారు. మరో వైపు కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సలార్ మూవీ ఇంకా సెట్స్ పై ఉంది.  పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా  తెరకెక్కుతున్న ఈ చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో డార్లింగ్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. వేసవి వెకేషన్ ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల కానుంది.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో  పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ చేస్తున్న విషయం తెలిసిందే. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ప్రభాస్ రామునిగా కనిపించనుండగా కియారా అద్వానీ సీతగా కనిపించనుంది. ఈ మూవీని ఆగస్ట్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక హాలీవుడ్ రేంజ్ లో స్పిరిట్ మూవీ తెరకెక్కనుంది. ఇలా వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉన్న ప్రభాస్ సైలెంట్ గా మరో పాన్ ఇండియా మూవీకి ఓకే చెప్పినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియలేదు కాని తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ కు ఈ అగ్ర హీరో సైన్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: