మెగాస్టార్ కు సర్జరీ ఎక్కడో తెలుసా?
ఈ సమావేశంలో కుడి చేతి కి కట్టు ను చూసిన అభిమానులు చిరు ను అడిగారు. దీని పై మెగాస్టార్ స్పందించారు. తనకు గత కొద్ది రోజుల నుంచి తన కూడి చేతికి కొద్ది పాటు నొప్పి వచ్చిందని తెలిపారు. ఈ నొప్పి పై వైద్యులను సంప్రదించగా కుడి చేతి మణికట్టు పై ఒత్తిడి పడటం వల్ల అలా అవుతుందని తెలిపారు. దీన్ని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారని వైద్యులు చెప్పారని తెలిపాడు. దీంతో అపోలో వైద్యులు సుమారు 45 నిమిషాల సమయం లో తన కుడి చేతికి ఆపరేషన్ చేశారని తెలిపారు. ప్రస్తుతం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. అలాగే మరో 15 రోజుల తర్వాత తన చేయి యథావిధిగా పని చేస్తుందని తెలిపారు. అలాగే ఈ సర్జరీ వల్లే తన సినిమా షూటింగ్ లకు కొంత గ్యాప్ ఇచ్చానని తెలిపారు. అయితే చిరంజీవి చేతికి జరిగింది చిన్న పాటి సర్జరీ కావడం తో చిరు అభిమానులు ఊపిరి పీల్చ కున్నారు.