అదరగొడుతున్న ఆకాష్ పూరి..!

Pulgam Srinivas
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్నతనం నుండే అనేక సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆకాష్ పూరి ఆ తర్వాత కాలంలో హీరోగా మారి ఆంధ్ర పోరి, మెహబూబా సినిమాలో నటించాడు. ఇలా ఆకాష్ పూరి హీరోగా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయినా,  ఈ హీరో నటనకు మాత్రం తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆకాష్ పూరి రొమాంటిక్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలకు జనాల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా, ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచాయి అని చెప్పవచ్చు. అయితే ఇలా జనాలలో మంచి అంచనాలను క్రియేట్ చేసుకున్న రొమాంటిక్ సినిమాను నవంబర్ 4 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే రొమాంటిక్ చిత్ర బృందం తాజాగా దసరా సందర్భంగా ఒక పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ పోస్టర్ ద్వారా ప్రేక్షకులకు రొమాంటిక్ చిత్ర బృందం దసరా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సినిమా లో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. అనిల్ పూధూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మాతలు. రొమాంటిక్ సినిమా కు పూరి జగన్నాథ్ నిర్మాత మాత్రమే కాకుండా కథ , స్క్రీన్ ప్లే , డైలాగులను కూడా అందించాడు. మరి ఈ సినిమాతో ఆకాష్ పూరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయా న్ని సాధిస్తారు తెలియాలి అంటే సినిమా విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: