రష్మిక లుక్ వెనుక ఇళయ రాజ !

Seetha Sailaja

దర్శకుడు సుకుమార్ నిర్మిస్తున్న ‘పుష్ప’ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. ఈమూవీలోని పాత్రల స్వభావం రీత్యా సుకుమార్ అల్లు అర్జున్ రష్మిక ల గెటప్ ను చాలసహజంగా తీర్చి దిద్దడమే కాకుండా వారి కాష్ట్యూమ్స్ విషయంలో కూడ చాల శ్రద్ధ తీసుకుంటున్నాడు.

లేటెస్ట్ గా విడుదలైన రష్మిక లుక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈమూవీలో ఒక పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతున్న రష్మిక లుక్ ను చాల సహజంగా తీర్చి దిద్దడానికి సుకుమార్ ప్రముఖ చిత్రకారుడు ఎస్. ఇళయరాజ స్పూర్తిని తీసుకోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.

ఇళయరాజా పేరు వినగానే అందరు సంగీత దర్శకుడు ఇళయరాజ అనుకుంటారు. అయితే ఈ ఇళయరాజ ఒక మంచి పెయింటర్. తమిళనాడులోని తంజావూరు ప్రాంతానికి చెందిన పేరు మోసిన పెయింటర్ అతడి బొమ్మలు అందమైన కలర్ ఫోటోలు లా ఉంటాయి. ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఇళయరాజ క్రితం సంవత్సరం కరోనా సోకి మరణించారు. అయితే ఆయన వేసిన బొమ్మలు మాత్రం శాస్వితంగా నిలిచిపోయాయి.

స్వతహాగా కళలు అంటే విపరీతమైన అభిమానం కల్గిన సుకుమార్ దృష్టికి ఇళయరాజా పెయింటింగ్స్ రావడంతో అచ్చు ఆ పెయింటర్ బొమ్మలలోని పల్లెటూరి అమ్మాయిగా రష్మిక ను తీర్చిదిద్ది ‘పుష్ప’ లో మనకు సుకుమార్ చూపెట్టబోతున్నాడు. ఈసినిమాలో అత్యంత సహజంగా నటించడమే కాకుండా చిత్తూరు యాసలో మాట్లాడటానికి రష్మిక కు ఒక ప్రత్యేకమైన ట్యూటర్ ను పెట్టి ఆమెకు గ్రామీణ భాష పై పట్టుదొరికే విధంగా స్వతహాగా లెక్కలు మాష్టారు అయిన సుకుమార్ రష్మిక కు పాఠాలు నేర్పించాడు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన చిత్రీకరణ తుది దశకు చేరుకోవడంతో ఈసినిమాలోని పాత్రల లుక్ ను జనానికి పరిచయం చేస్తూ ‘పుష్ప’ పై మరిన్ని అంచనాలు పెంచడానికి సుకుమార్ చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. డిసెంబర్ 17న విడుదల కాబోతున్న ఈమూవీ ‘బాహుబలి’ రేంజ్ లో హిట్ అవుతుందని బన్నీ ఆభిమానుల ఆశ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: