సామ్ స్టైలిస్ట్ కు అక్కినేని ఫ్యాన్స్ బెదిరింపులు..!

MADDIBOINA AJAY KUMAR
చైసామ్ ల‌ మధ్య అసలు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఏదో జరిగిందని ఇద్దరు విడిపోయారు అని ఇటీవల సమంతతో శాకుంతలం సినిమాలను నిర్మించిన నిర్మాత నీలిమ మీడియాకు తెలిపారు. అంతేగాకుండా పిల్లలు కనాలని స‌మంత కోరుకుంద‌ని  కానీ రెండు నెలల్లోనే స‌మంత చైతన్య‌ మధ్య ఏదో జరిగి ఇద్దరూ విడిపోయే వరకు వచ్చిందని ఆమె చెప్పారు. సమంత పిల్లలు క‌న‌డానికి ఇష్టపడకపోవడం... సినిమాలు చేస్తూ కుంటుంబానికి దూరంగా ఉండడం వల్లే చైతన్య తో విభేదాలు వచ్చాయని కొన్ని వార్తలు రాగా మరో వైపు సమంత స్టైలిస్ట్ ప్రీతం జుక‌ల్క‌ర్ తో ఉన్న రిలేషన్ షిప్ ఇద్దరి మధ్య విభేదాలకు దారి తీసింద‌ని వార్త‌లు వచ్చాయి. 

అయితే ఆ పుకార్ల‌ను కొంతమంది  సృష్టించారు. అయితే సమంత పిల్లలను క‌న‌క‌పోవడం వల్లే విడాకులు తీసుకుంది అనే వార్త‌ల‌కు నీలిమ చేసిన వ్యాఖ్యలతో  బ్రేక్ ప‌డ‌గా సమంత తో తనకు ఉన్న సంబంధంపై ఆమె స్టైలిష్ట్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమంత తనకు సోదరి లాంటిదని ఆ విషయం నాగ చైత‌న్య‌కు కూడా తెలుసు అని చెప్పారు. సోషల్ మీడియాలో తాను కొంత మంది అభిమానుల వ‌ల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అని వ్యాఖ్యానించారు. ఫ్యాన్స్ తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని జుక‌ల్క‌ర్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కొద్దిరోజులుగా తనకు వస్తున్న బెదిరింపు మెసేజ్ లను స్క్రీన్ షాట్ తీసుకుని జుక‌ల్క‌ర్ ఫిర్యాదు చేస్తున్నారు.

ఇక తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ.... బెదిరింపు మెసేజ్ తో తన ఇన్బాక్స్ నిండిపోతుంది అని జుక‌ల్క‌ర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంపేస్తామంటూ కొంతమంది అభిమానులు తనకు మెసేజ్ లు చేస్తున్నారని జుక‌ల్క‌ర్ ఆవేదన వ్యక్తం చేశాడు. కొంతమంది కెరీర్ ను నాశనం చేస్తామని మరి కొంతమంది ఇంటి నుండి బయటకు వస్తే చంపేస్తామని మెసేజ్ లు పెడుతున్నారు అంటూ జుక‌ల్క‌ర్  ఆరోపించాడు. మరికొందరు తన తల్లి బతికుండగానే చనిపోయినట్టు వార్తలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి బెదిరింపుల‌కు పాల్ప‌డినా తాను సమంత వైపు నిలబడతానని జుక‌ల్క‌ర్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: