డ్రగ్స్ కేసులో కొడుకు...షారుక్ కు షాక్ ఇచ్చిన బైజ్యూస్..!

MADDIBOINA AJAY KUMAR
విద్యార్థులకు ట్యూషన్లు చెప్పే బైజూస్ యాప్ హీరో షారుక్ ఖాన్ కు షాక్ ఇచ్చింది. బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ బైజూస్ యాప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ యాప్ ద్వారా షారుఖ్ ఖాన్ సంవత్సరానికి నాలుగు కోట్ల రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారు. అయితే తాజాగా బైజుస్ ఆ కాంట్రాక్టును రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఇటీవల ముంబైలో క్రూయిజ్ నౌకలో జరిగిన పార్టీలో డ్రగ్స్ వాడుతూ పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆర్యన్ ఖాన్ పై డ్రగ్స్ కేసు నమోదవగా.... ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఆర్యన్ ఖాన్ ను బయటకు తీసుకువచ్చేందుకు షారుఖ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ఇప్పుడు కొడుకు చేసిన తప్పుకు తండ్రికి తిప్పలు తప్పడం లేదు.  ఓ వైపు ఆర్యన్ ఖాన్ జైల్లో ఉంటే మరోవైపు షారుక్ ఖాన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా తొలగిస్తూ బైజూస్ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే బైజూస్ యాప్ షారుక్ ఖాన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా శాశ్వతంగా కాకుండా నాలుగేళ్ల పాటూ మాత్రమే తొలగించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే షారుక్ ఖాన్ కు సంబంధించిన యాడ్ ను బైజూస్ ప్రసారం చేయడం నిలిపివేసింది.

డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ పట్టుబడిన నాటి నుండి బైజూస్ యాడ్ పై నెటిజన్లు మండి పడుతున్నారు. కొడుకుకు చెప్పుకొలేని షారుఖ్ ప్రజలకు బైజూస్ తో ఏం చెబుతాడు. అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే షారుక్ ఖాన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా తొలగిస్తూ బైజూస్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ జి, దుబాయ్ టూరిజం బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. మరి ఈ బ్రాండ్లు షారుఖ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: