పిల్లలను కనాలనుకున్న సమంత..షాకింగ్ విషయాలు బయటపెట్టిన నీలిమ గుణ..!

MADDIBOINA AJAY KUMAR
నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం సమంత పిల్లలను కనక పోవడమే అని రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా సమంత ఫ్యామిలీ పై దృష్టి పెట్టడం లేదని సినిమాలతో ఫుల్ బిజీగా ఉందని అందువల్లే చైతూతో విడిపోవాలనుకుందని వార్తలు వచ్చాయి. ఆ వార్తల పై సమంత కూడా సోషల్ మీడియా ద్వారా ఖండించింది. ఇక ఇప్పుడు సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమా నిర్మాత, శాకుంతలం సినిమా దర్శకుడు గుణశేఖర్ కోడలు నీలిమా గుణ సమంత గురించి ఆసక్తికర ఈ విషయాలను వెల్లడించింది.

శకుంతలం సినిమా కోసం సమంతను సంప్రదించగా.... అప్పటికే సమంత సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఫ్యామిలీ ప్లానింగ్ లో సమంత ఉన్నట్టు తనతో చెప్పారని నీలిమ వెల్లడించింది. అయితే శాకుంతలం సినిమా కథ బాగా నచ్చడంతో సమంత ఓకే చెప్పిందని ...అంతేకాకుండా జూలై, ఆగస్టు నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని సమంత కండిషన్ పెట్టిందని నీలిమ గుణ వెల్లడించింది. ఆ కండిషన్ కు చిత్ర యూనిట్ కూడా ఒప్పుకోవడం తో సమంత సినిమాలో నటించిందని నీలిమ పేర్కొంది.

సమంత కుటుంబం గురించి ఎంతగానో ఆలోచించారని కానీ రెండు నెలల్లోనే ఏదో జరిగిందని నీలిమ వెల్లడించింది. ఇక నీలిమ గుణ చేసిన వ్యాఖ్యలతో సామ్ చై మధ్య రెండు నెలల్లోనే ఏదో జరిగి ఉంటుందని అర్థమవుతుంది. ఇక నీలిమ గుణ సమంత గురించి చెప్పిన మాటలతో ఇకనైనా ఆమెపై విమర్శలు తగ్గుతాయా చూడాలి. ఇక తనపై వస్తున్న విమర్శలపై స్పందించిన సమంత ప్రస్తుతం దేనినీ పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా సామ్ ఇప్పటికే షూటింగ్ లలో బిజీగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎన్టీఆర్ హోస్ట్ గా వస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్న సమంత 25 లక్షల చెక్ ను కూడా అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: