హాట్ టాపిక్ గా మారిన ప్రభాస్ జాతకం !

Seetha Sailaja
సమంత నాగచైతన్య లు విడిపోతారు అంటూ జ్యోతిష్కుడు వేణు స్వామి అప్పట్లో చెప్పినప్పటికీ మొదట్లో ఎవరు పట్టించుకోలేదు. అయితే సమంత చైతన్యలు విడాకులు తీసుకున్న తరువాత వేణు స్వామి చెప్పిన జాతకం నిజం కావడంతో సోషల్ మీడియాలో వేణు స్వామి గురించి చాలామంది సర్చింగ్ చేయడం మొదలుపెట్టారు.

ఈ సంఘటన జరిగి కొద్దిరోజులు గడవకుండానే ఒక ప్రముఖ జ్యోతిష్కుడు ప్రభాస్ జాతకం పై చెప్పిన భవిష్యవాణి ప్రభాస్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారి వారికి మంచి జోష్ ను కలిగిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ కు శుక్ర మహర్దశ నడుస్తోందని రానున్న కొన్ని సంవత్సరాలు ప్రభాస్ కు కెరియర్ పరంగా ఎదురులేదు అంటూ ఆ జ్యోతిష్కుడు చెప్పినట్లుగా వస్తున్న వార్తలు అభిమానులకు విపరీతమైన ఆనందాన్ని ఇస్తున్నాయి.

ప్రస్తుతం ప్రభాస్ మూడు భారీ సినిమాలలో నటిస్తున్నాడు. ఆ మూడు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ మూవీలు కావడంతో ఈ మూడు సినిమాల పై భారీ అంచనాలు ఉన్నాయి. గత సంవత్సరం అదేవిధంగా నడుస్తున్న సంవత్సరంలో ప్రభాస్ నుండి మూవీ విడుదల కాలేదు. దీనితో అతడి అభిమానులు సంక్రాంతికి రాబోతున్న ‘రాథే శ్యామ్’ గురించి విపరీతమైన అంచనాలు పెంచుకుంటున్నారు. అయితే ఈసారి ప్రభాస్ తనకు నేషనల్ సెలెబ్రెటీ హోదాను తెచ్చిపెట్టిన ‘బాహుబలి’ సృష్టి కర్త రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ తో పోటీ పడవలసిన పరిస్థితులు.

ఇప్పటికే ప్రభాస్ పారితోషికం 100 కోట్ల స్థాయిలో ఉంది ఈ రేంజ్ లో పారితోషికం తీసుకునే టాలీవుడ్ హీరోలు ఎవరు లేరు. శుక్ర మహర్థశ తో ప్రభాస్ కు ఇన్ని రకాల పేరు ప్రఖ్యాతులు ఆదాయం వస్తున్నా పెళ్ళి విషయంలో మాత్రం ప్రభాస్ కు ఇంకా గ్రహాలూ అనుకూలంగా లేవు అని ఆ జ్యోతిష్కుడు చెప్పిన మాటలు నిజం అయితే ఇప్పట్లో ప్రభాస్ పెళ్ళి ముచ్చట లేదనే అనుకోవాలి. అయితే జాతకాలు ఎంత వరకు నిజం అవుతుంది అన్నది ఎవరికీ తెలియని విషయం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: