లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో టాప్ మూవీ ఇదే?

VAMSI
సినిమాలు చాలా జోనర్ లలో చిత్రీకరిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క జోనర్ కు ఫ్యాన్స్ తప్పక ఉంటారు. అందులో భాగంగానే ఒక్క జోనర్ అయిన లేడీ ఓరియంటెడ్ మూవీస్ చాలానే వచ్చాయి. కానీ అన్ని సినిమాలు సక్సెస్ కాలేదు. కానీ సక్సెస్ తో సంబంధం లేకుండా ప్రజలను ఆకట్టుకున్న ఎన్నో సినిమాలు మనము చూశాము. కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అటువంటి సినిమాలలో ఒక మంచి పవర్ ఫుల్ మూవీ గురించి ఇప్పుడు అందులో కొన్ని విషయాలు తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ అమితాబ్ గా పేరు పొందిన విజయశాంతి గురించి అందరికీ తెలిసిందే. తనకు ఇచ్చిన ఏ పాత్రలో అయినా నటించి ఆకట్టుకోగల ప్రతిభ ఆమె సొంతం.
1990 వ సంవత్సరంలో మోహన్ గాంధీ దర్శకత్వం వహించిన చిత్రం "కర్తవ్యం". ఈ చిత్రం అప్పట్లో ఒక సంచలనంగా మారింది. ఇందులో లీడ్ రోల్ లో  నటించిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాకు కథను రచయిత ద్వయం పరుచూరి బ్రదర్స్ అందించారు. ఇది ఒక నిజ జీవిత కథను ఆధారంగా చేసుకుని  కథను తయారు చేశారు. ప్రముఖ ఐపిఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తీశారు. ఒక రాజకీయ యాక్షన్ చిత్రంగా వచ్చి  ఎంతో మంది దర్శకులు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను తీయడానికి ఒక దైర్యాన్ని ఇచ్చింది.  
ఈ చిత్రంలో వైజయంతి ఐపిఎస్ గా నటించిన విజయశాంతి అదరగొట్టింది. మిగిలిన పాత్రలు తమ పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. విలన్ పాత్రలో చరణ్ రాజ్ పాత్ర కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళింది.  ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్.  రాజ్ కోటి మంచి నేపథ్య సంగీతాన్ని అందించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా నిడివి మొత్తం రెండు గంటల 30 నిముషాలు. అయినా చూస్తున్నంతసేపు ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ చేసింది.  ఈ సినిమా ఎ.ఎం రత్నం సూర్య మూవీస్ బేనర్ పై కేవలం 90 లక్షల బడ్జెట్ తో నిర్మించారు.  అయితే ఈ సినిమా తన  టోటల్ రన్ లో 7 కోట్ల రూపాయలను వసూలు చేసి ఘన విజయాన్ని అందుకుంది.  ఈ సినిమా తర్వాత ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చాయి. విజయశాంతి ఈ సినిమాతో హీరోకు సమానమైన గుర్తింపు తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: