లవ్ స్టోరీ బాగుంది కానీ .... ??

GVK Writings
నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల తీసిన తాజా సినిమా లవ్ స్టోరీ. ఇటీవల ఈ సినిమా నుండి బయటకు వచ్చిన సాంగ్స్, ట్రైలర్, టీజర్ అన్ని కూడా ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ దక్కించుకున్నాయి. పవన్ సంగీతం అందించిన ఈ సినిమాని ఏషియన్ సినిమాస్ నారాయణ్ దాస్ నారంగ్ తో పాటు శేఖర్ కమ్ముల ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఇక ఎన్నో అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇటీవల ఫిదా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల, అదే స్టైల్ లో ప్రేమకథా చిత్రంగా హృద్యంగా దీనిని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ చాలా వరకు ఆకట్టుకునే విధంగా కొంత ఎంటర్టైన్మెంట్, రొమాంటిక్ గా ముందుకు నడిపిన శేఖర్ కమ్ముల, సెకండ్ హాఫ్ విషయమై మరింత శ్రద్ధ పెట్టి ఉంటె బాగుండేదని అంటున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ప్రారంభంలో మెల్లగా సాగడంతో పాటు ఆ తరువాత చాలా వరకు సినిమా చాలా మెల్లగా సాగుతుందనేది కొందరు ప్రేక్షకులు చేస్తున్న విమర్శ.
అయితే ఓవరాల్ గా సినిమా బాగుందని పలువురు ప్రేక్షకులు అంటున్నారు. ఇక మూవీలో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన సాయి పల్లవి, నాగ చైతన్య ఇద్దరూ కూడా తమ తం పాత్రల్లో ఎంతో ఒదిగిపోయి నటించారని, ముఖ్యంగా ఈశ్వరి రావు, రాజీవ్ కానకాల, గంగవ్వ వంటి వారి పాత్రలు ఆకట్టుకున్నాయని చెప్తున్నారు. పవన్ అందించిన సంగీతం, నేపధ్య సంగీతం సినిమాకి మరింత ప్లస్ కాగా మొత్తంగా సినిమా చాలా ఏరియాల్లో బాగా ఓపెనింగ్స్ దక్కించుకుంది. అయితే మొత్తంగా మంచి టాక్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా రాబోయే రోజుల్లో ఎంత మేర ప్రేక్షకుల మెప్పుతో ముందుకు సాగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: