యాంకర్ శివకు అవమానం.. స్టేజ్ మీద పెద్ద గొడవ?

praveen
యూట్యూబ్ ద్వారా ఎక్కువగా పాపులారిటీ సంపాదించి ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాల్లో అక్కడక్కడా కనిపిస్తున్నా యాంకర్ శివ గురించి దాదాపుగా తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది.  ఎప్పుడూ కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూలలో యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతూ ఉంటాడు యాంకర్ శివ.  ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీల ను ఇంటర్వ్యూ చేసి ఫెమ్ సంపాదించాడు. ఇక ఇటీవల జబర్దస్త్ లోకి కూడా స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఏకంగా అనసూయ పొట్టి పొట్టి బట్టల పై షాకింగ్ కామెంట్స్ చేసి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు.

 ఇలా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి అనసూయ డ్రెస్ పై ఎవరూ ఊహించని విధంగా షాకింగ్ కామెంట్స్ చేయడంతో యాంకర్ శివ బుల్లితెర ప్రేక్షకులందరికీ సుపరిచితుడిగా మారిపోయాడు అనే చెప్పాలి. ఇక ఇటీవలే మరోసారి  యాంకర్ శివ  ఈటీవీ లోని మరో కార్యక్రమంలో కనిపించాడు.  ఇక ఇటీవలే ఈ టీవీలో ప్రసారమయ్యే రెచ్చిపోదాం బ్రదర్ అనే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  ఇక ఈ ప్రోమోలో భాగంగా నన్ను జబర్దస్త్ కమెడియన్స్ అవమానించారంటూ గొడవపెడుకున్నాడు యాంకర్ శివ.

 ఈ షోలో భాగంగా ఫాహిమాను ఇంటర్వ్యూ చేస్తున్నట్లుగా యాంకర్ శివ వచ్చి కూర్చున్నాడు. ఈ క్రమంలోనే నువ్వు ప్రొఫెషన్ మార్చుకోవాలి అది ఇది అంటూ ఫాహిమా పంచులు వేస్తుంది. అటు వెంటనే సీరియస్ అవుతాడు యాంకర్ శివ. నీకు అసలు ఆర్టిస్ట్ అవకాశం ఎవరిచ్చారు. అన్ని చిల్లర పనులు చిల్లర మాటలు అని సీరియస్  అవుతాడు. ఇక ఇంతలో అక్కడికి చేరుకున్న పంచ్ ప్రసాద్  చిల్లర మనుషులు చిల్లర మాటలు అని ఎవరిని అంటున్నవ్ షో ని అవమానిస్తున్నావ్ అంటూ సీరియస్ అవుతాడు. ఇక ఇంతలో జబర్దస్త్ కమెడియన్స్ వచ్చి మధ్య గొడవలు ఆపడానికి ప్రయత్నిస్తారు. ఇదంతా చూసిన జడ్జి బాబా భాస్కర్ అక్కడనుంచి వెళ్ళి పోతాడు.  ఇలా నాకు అవమానం జరిగింది అంటూ స్టేజ్ మీద పెద్ద గొడవ పెట్టుకుని రచ్చ రచ్చ చేస్తాడు యాంకర్ శివ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: