చిరంజీవి సినిమాకు 15 ఏళ్ళు...!(స్టాలిన్ )

murali krishna
మెగాస్టార్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే విధంగా తమిళ దర్శకుడు అయిన ఏ ఆర్ మురుగుదాస్ కథను సిద్ధం చేసి డైరెక్ట్ చేసిన సినిమానే స్టాలిన్ మూవీ. చిరంజీవి అభిమానులను మరియు ఆడియన్స్ ని విశేషంగా అలరించిందని చెప్పవచ్చు.
అక్క చెప్పిన మాట వినే తమ్ముడు పాత్రలో చిరంజీవి నటించి మెప్పించాడు. అక్కగా ఖుష్బూ నటించి ఎంతగానో ఆకట్టుకుంది. స్టాలిన్ సినిమా 2006సెప్టెంబర్ 20న విడుదలైందని సమాచారం.ఈ సినిమా సుమారు 394సెంటర్స్ లో 500కి పైగా ప్రింట్స్ తో విడుదలయిందని సమాచారం.ఈ మూవీ విడుదలైన వారంలోనే 20కోట్లు రాబట్టిందని సమాచారం.
మెగా బ్రదర్ నాగబాబు నిర్మించిన ఈ మూవీకి మణిశర్మ సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు. ఈ సినిమాకు పోటీగా వచ్చిన సినిమాల గురించి చెప్పుకుంటే..
 స్టాలిన్ సినిమాకి వారం గ్యాప్ తో సెప్టెంబర్ 27న రిలీజైన నాగార్జున నటించిన బాస్ మూవీ కి వి ఎన్ ఆదిత్య దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా బాగా నిరాశ పరిచిందని చెప్పవచ్చు. ఆ సినిమాలో నయనతార మరియు పూనమ్ బజ్వా,శ్రేయ హీరోయిన్స్ గా నటించారు
సెప్టెంబర్ 29న నవదీప్ నటించిన సీతాకోక చిలుక విడుదలయిందని సమాచారం. ఆ సినిమాలో షీలా హీరోయిన్ గా నటించింది.ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచిందని చెప్పవచ్చు . ఇదే రోజున ముమ్ముట్టి నటించిన మహానగరంలో మాయగాడుగా వచ్చిన మలయాళ డబ్బింగ్ మూవీలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేక పోయిందని తెలుస్తుంది.
ఇక స్టాలిన్ కి ముందుగా వచ్చిన మూవీస్ చూస్తే సెప్టెంబర్ 15న గంగ మూవీ విడుదలయిందని తెలుస్తుంది.ఇది కూడా ఫెయిల్ అయిందని సమాచారం.వేణు హీరోగా ఇల్లాలు ప్రియురాలు మూవీ సెప్టెంబర్ 14న విడుదలయిందని తెలుస్తుంది.ఇది కూడా ప్లాప్ గా మిగిలిందని సమాచారం.ఇదే రోజున రామ్ గోపాల్ వర్మ శివ 2006మూవీ డిజాస్టర్ గా మిగిలిందని తెలుస్తుంది. ఆ సినిమాలో హీరోయిన్ నిషా కొఠారి గ్లామర్ తో ఆకట్టుకుందని తెలుస్తుంది.
సెప్టెంబర్ 14న వచ్చిన వనజ మూవీ తక్కువ బడ్జెట్ తో అందరూ కొత్తవాళ్లతో తెరకెక్కిందని సమాచారం.అవార్డుల పంట పండించిన ఈ మూవీ ఫీల్ గుడ్ గా నిల్చిందని తెలుస్తుంది. అయితే థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేదట.ఇక మా ఇద్దరి మధ్య మూవీ సెప్టెంబర్ 12న వచ్చిందని తెలుస్తుంది. ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అలరించిన సినిమా ఆడలేదని సమాచారం. సూర్య నటించిన నువ్వు నేను ప్రేమ మూవీ సెప్టెంబర్ 8న విడుదలయిందని తెలుస్తుంది. జ్యోతిక హీరోయిన్ గా నటించింది  ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా విజయాన్ని అందుకోలేకపోయిందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: