రాధేశ్యామ్ టీమ్ మౌనం వీడేది ఆరోజేనా ... ??

GVK Writings
ప్రభాస్ తో తొలిసారిగా రాధాకృష్ణ తీస్తున్న తాజా సినిమా రాధేశ్యామ్. యువ భామ పూజా హెగ్డే, రెబల్ స్టార్ కి జోడీగా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణం రాజు, షా షా ఛత్రి, ప్రియదర్శి, భాగ్యశ్రీ, జయరాం తదితరులు ఇతర పాత్రలు చేస్తుండగా పాన్ ఇండియా మూవీగా దీనిని వంశీ, ప్రమోద్ యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో హై టెక్నీకల్ వాల్యుస్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతోందని, అలానే యూనిట్ ముందుగా ప్రకటించిన విధంగా సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపడం ఖాయం అని తెలుస్తోంది. ఈ పాన్ ఇండియా మూవీ సౌత్ భాషలకి గాను జస్టిన్ ప్రభాకరన్ అలానే హిందీ భాషకి మన్నన్ మిథూన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి అందరి నుండి మంచి స్పందన లభించింది. ఇన్నర్ సోర్సెస్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన ఒక వాస్తవ ప్రేమకథకు రూపంగా పలు కమర్షియల్ హంగులు అద్ది దర్శకుడు రాధాకృష్ణ దీనిని ఎంతో అద్భుతంగా తెరకెక్కించినట్లు టాక్.
అయితే విషయం ఏమిటంటే, ఈ సినిమాకి సంబంధించి చాలా రోజుల నుండి ఎటువంటి అప్ డేట్ రాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కొంత నిరాశకు గురవుతుండగా కొన్ని ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ రాధేశ్యామ్ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ ని యూనిట్, దసరా పండుగ రోజున విడుదల చేయనుందని, అందుకే అప్పటివరకు యూనిట్ మౌనం వహిస్తోందని అంటున్నారు. సరిగ్గా పండుగకు మూడు రోజుల ముందు ప్రభాస్ ఫ్యాన్స్ ని ఖుషి చేసేలా అప్ డేట్ ఇవ్వనున్నారట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ కనుక నిజం అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇక పండుగే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: