ఆ పాత్రలకు పెట్టింది పేరు రమ్య కృష్ణ..?

Divya
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రమ్యకృష్ణ అంటేనే అప్పట్లో ఐరన్ లెగ్ గా ముద్ర పడిపోయింది. ఈమె దాదాపు గా నటించిన చాలావరకు సినిమాలు.. అప్పట్లో భారీ డిజాస్టర్ ను చూడడంతో దర్శక నిర్మాతలు కూడా ఈమెతో సినిమా తీయాలంటే ఎక్కడ డిజాస్టర్ గా మిగులుతుందోనని  భయపడేవారు. ఇక తర్వాత అల్లుడుగారు సినిమా తో ఐరన్ లెగ్ అని పిలిపించుకున్న రమ్యకృష్ణ , తర్వాత ఎంతోమంది స్టార్ హీరోలకు గోల్డెన్ లెగ్ గా మారిపోయి, సినిమా చేస్తే రమ్యకృష్ణతోనే అన్నట్టుగా అందరూ మారిపోయారు.

అంతలా మహర్దశ ఆమెను పట్టుకుంది అని చెప్పవచ్చు. ఆ తర్వాత వరుస సక్సెస్ లతో దూసుకుపోయిన రమ్యకృష్ణ కొన్ని పాత్రలకు పెట్టింది పేరు అన్నట్టుగా మారిపోయింది.. ముఖ్యంగా లేడీ హీరోయిన్లను మాత్రమే చూసాము కానీ లేడీ విలన్ గా గుర్తింపు పొందింది మాత్రం రమ్యకృష్ణ. ఇక నీలాంబరి సినిమాలో ఈమె నటనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే అని అనిపిస్తుంది. కళ్ళల్లో ఉట్టిపడే రాజసం.. తన నటన ఉగ్రరూపం ప్రేక్షకుల వెన్నుల్లో భయం పుట్టించేలా అనిపిస్తాయి. ఇక రమ్య కృష్ణ లో ఉన్న నటనా ప్రతిభకు నీలాంబరి సినిమా అద్దం పడుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
ఎప్పుడు అల్లరిగా దూసుకుపోయే రమ్యకృష్ణ ఒక్కసారిగా నీలాంబరి సినిమా లో విలన్ గా కనిపించి అందరినీ భయపెట్టింది. నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె, ఆ తరువాత సోగ్గాడే చిన్నినాయన అనే సినిమా ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. ఇక తర్వాత బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో నటించి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిలో పడింది రమ్యకృష్ణ. రమ్యకృష్ణ పాత్రకు శ్రీదేవి ని అనుకున్నప్పటికీ ఆమె రిజెక్ట్  చేయడంతో రమ్యకృష్ణ నటించి, ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఒకవేళ శ్రీదేవి గనుక ఆ పాత్రలో నటించి ఉన్నట్లయితే తప్పకుండా ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలేదని  అప్పట్లో నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను తెలియజేశారు. అలా రాజసం ఉట్టిపడే పాత్రలకు కేవలం రమ్యకృష్ణ మాత్రమే సెట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: