కోట - బాబు మోహన్ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం..?

Divya
విలక్షణ నటనకు కోట శ్రీనివాసరావు కేరాఫ్ అడ్రస్ అయితే వినోదానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు బాబు మోహన్.. వీరిద్దరూ కలిస్తే ఏ సినిమాలో నైనా 24 క్యారెట్ల మేలిమి పనితనంలా ఉంటుంది వీరిద్దరి నటన.. ఇక కోట శ్రీనివాసరావు నటనలో విలనిజంలో రాజసం ఉట్టిపడుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. బాబు మోహన్ కూడా విలనిజంలో కూడా కామెడీని పండించే నైజం ఈయనది.. అలా వీరిద్దరూ కలిసి నటించి కామెడీ టైమింగ్ కు ప్రేక్షకులు చాలా బాగా ఫిదా అయ్యారు..

ముఖ్యంగా వీరు ఇద్దరూ కలిసి సుమారుగా 60 చిత్రాలకు పైగా జోడిగా నటించి , సినీ ప్రేక్షకులకు కన్నుల పండుగగా కనిపించారు.. ఆనాటి కాలంలో బాబు మోహన్, కోట శ్రీనివాస్ రావు జోడి లేని సినిమా లేదంటే అది అతిశయోక్తి కాదు.. 1999లో బీజేపీ తరఫున కోటశ్రీనివాసరావు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్నికైన విషయం తెలిసిందే.. అదే సమయంలో బాబు మోహన్ కూడా టీడీపీ ఎమ్మెల్యే గా ఎన్నికవడంతో పాటు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు.. ఇక తర్వాత బాబు మోహన్ ఇంకో రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా పని చేయడం గమనార్హం..

ఇంతటి ప్రతిభను కనబరిచిన వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం ఏది అని ఇటీవల యువత తెగ ఆలోచిస్తున్నారు.. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా బి.గోపాల్ దర్శకత్వం వహించిన బొబ్బిలిరాజా సినిమాలో నటించారు. ఈ సినిమాలో దివ్యభారతి హీరోయిన్ గా, వెంకటేష్ హీరోగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. దివ్యభారతి కూడా ఈ సినిమాకు తొలి పరిచయస్తురాలు..

ఇక కోట శ్రీనివాసరావు , చిరంజీవి హీరోగా వచ్చిన ప్రాణంఖరీదు అనే సినిమాతో వెండితెరకు పరిచయమై, కొంతకాలం గ్యాప్ తీసుకుని ఆ తర్వాత వందేమాతరం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన తన సినీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోలేదు.. బాబు మోహన్ కూడా ఆహుతి అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: