సురేష్ ప్రొడక్షన్స్ లోగో వెనుక అంత సీక్రెట్ ఉందా...?

murali krishna
రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యధిక సినిమాలను నిర్మించి స్టార్ ప్రొడ్యూసర్ గా చిత్ర పరిశ్రమలో నిలిచిపోయారని తెలుస్తుంది.రామానాయుడు తర్వాత ఈ బాధ్యతలను రామానాయుడు గారి కొడుకు అయిన పెద్దబ్బాయి సురేష్ బాబు నిర్వహిస్తున్నారని సమాచారం.
 
ఇక సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమాలు టెలివిజన్లో ప్రసారమవుతున్నాయంటే ముందుగా ఈ బ్యానర్ కు సంబంధించిన S.P అనే లోగో మనకు కనబడుతుందని తెలుస్తుంది.S.P అనగా సురేష్ ప్రొడక్షన్స్ అని అందరికి తెలుసు.ఈ లోగో టీవీలో కనిపించిందంటే తప్పకుండా అది సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా అని అందరికీ అర్థమవుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ లోగోకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం
S.P అనే లోగో వెనుక చిన్న కథ దాగి ఉందట. అయితే ఈ రెండు పదాల పై ఇద్దరు పిల్లల బొమ్మలు మనకు కనబడతాయని అందరికి తెలిసిన విషయమే. అయితే ఆ పిల్లలు ఎవరు అనే విషయం గురించి నిర్మాత సురేష్ బాబు ఓ సందర్భంలో వెల్లడించారని తెలుస్తుంది. S.P అనే లోగో తయారు చేసిన తర్వాత ఇది మరింత ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఆ రెండు పదాల పై ఇద్దరు పిల్లలను పెట్టినట్లు వెల్లడించారని సమాచారం.అయితే ఆ ఇద్దరూ ఎవరో కాదు ఒకరు విక్టరీ వెంకటేష్ అని అలాగే మరొకరు తానేనని సురేష్ బాబు ఓ సందర్భంలో ఆ లోగో వెనుక ఉన్న అసలు విషయాన్ని బయటపెట్టారని సమాచారం. అయితే Sఅనే పదం పై ఉన్నది వెంకటేష్ అని అలాగే P అనే పదం పై ఉన్నది తనేనని సురేష్ బాబు వెల్లడించారని సమాచారం. ఆ పదాల పై ఉన్న విధంగానే S పదంపై వెంకటేష్ బాబు సూపర్ హీరో అయ్యారట అలాగే S పదం పై ఉన్న నేను ప్రొడ్యూసర్ గా మంచి పేరు సంపాదించుకున్నానని ఓ ఇంటర్వ్యూ సందర్భంలో సురేష్ బాబు నవ్వుతూ ఈ విషయాన్ని పంచుకున్నారని సమాచారం.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నిర్మాణ సంస్థలలో సురేష్ ప్రొడక్షన్ సమస్త ఒకటి అని అందరికి తెలుసు. తెలుగు సినిమా పరిశ్రమలో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించి తెలుగు సినిమా పరిశ్రమలో గొప్ప నిర్మాతగా పేరు ప్రఖ్యాతులు మూవీ మొగల్ డాక్టర్ డి.రామానాయుడు గారు సంపాదించుకున్నారని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: