"ఇలియానా" అందాలు మిస్ అవుతున్న తెలుగు ప్రేక్షకులు ?

Veldandi Saikiran
టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానా. నాజూకు నడుముతో.. తెలుగు చిత్ర పరిశ్రమను ఒక ఊపు ఊపేసింది. హీరో రామ్ నటించిన దేవదాసు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద స్టార్ల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది ఇలియానా. దేవదాసు సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమాలో మెరిసింది ఇలియానా. ఇక ఈ సినిమా 2006 సంవత్సరంలో విడుదల కాగా... అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది పోకిరి సినిమా. 

ఈ సినిమాతో ఇలియానా క్రేజ్ ఎక్కడికో వెళ్లింది. పోకిరి సినిమా అనంతరం..  ఖతర్నాక్, రాఖి, మున్నా, ఆట సినిమాలో నటించింది ఇలియానా. అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ ముందు నిరాశపరిచాయి. దీంతో ఇలియానా క్రేజ్ కాస్త తగ్గి పోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా సినిమాలో ఇలియానా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది ఇలియానా. అంతేకాదు ఈ సినిమాకు ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకుంది ఇలియాన. ఆ తరువాత కిక్ సినిమా మరియు జులాయి సినిమాల్లో నటించి మంచి విజయాన్ని సాధించింది.

ఇంకా 2018 సంవత్సరం లో రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా అనంతరం... ఇలియానా తెలుగు ప్రేక్షకులు కనిపించకుండా పోయింది. వరుస ఫ్లాప్ లు మరియు హీరోయిన్ల కాంపిటీషన్ కారణంగా ఈయనకు మంచి సినిమాల ఆఫర్స్ రాలేదు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త సినిమాలు చేయలేదు ఇలియానా. మరి కొన్ని రోజులు అయితే పూర్తిగా ఈ నాజూకు నడుము అందరూ మరిచిపోయే టైం కూడా దగ్గరపడుతోంది. ఈ లోపు పైన ఏదైనా సినిమా ఛాన్స్ కొట్టేస్తే.. ఈయన మళ్లీ ఫామ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: