తలైవి సినిమాలో.. ఆ సీన్లు తొలగించాలంటూ డిమాండ్..?

Divya
ఇటీవల తమిళ్ నాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా తలైవి అనే సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఇకపోతే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలలో తప్పులు ఉన్నాయని, అందుకే వాటిని వెంటనే తొలగించాలి అంటూ అన్నా డీఎంకే నేత అలాగే మాజీ మంత్రి మన్నత్తి జయ కుమార్ పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ క్రమంలో చెన్నై లో ఆయన ఈ సినిమా చూసి మీడియాతో మాట్లాడారు.. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు ఏఎల్ విజయ్ చాలా చక్కగా తెరకెక్కించారని.. కానీ ఇందులో జయ లలిత, ఎంజీఆర్ మధ్య జరిగిన కొన్ని సన్నివేశాల పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం.

ముఖ్యంగా వీరిద్దరి మధ్య జరిగిన కొన్ని సన్నివేశాలు చాలా తప్పు గా చూపించారు అని.. ఎంజీఆర్.. జయలలిత కు అసలు ప్రాధాన్యత ఇవ్వలేదు అన్నట్లుగా చూపించారు..అని వెంటనే వీటిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు కరుణానిధి , ఎంజీఆర్ మధ్య జరిగిన కొన్ని సన్నివేశాలను కూడా తీసి వేయాలంటూ జయకుమార్ వెల్లడించారు. ఇకపోతే ఎంజీఆర్ తొలి డీఎంకే ప్రభుత్వం లో ఉన్నప్పుడు పదవులు ఆశించలేదు.. కానీ ఈ తలైవి సినిమాలో మాత్రం ఆయన మంత్రి పదవి కోరినపుడు, అప్పటి డీఎంకే సీఎం అన్నాదురై , ఎం.కరుణానిధి అడ్డుకున్నట్లు చూపించడం చాలా తప్పని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించాడు..

ఇలాంటి మరికొన్ని సీన్లు చాలా తప్పుగా తెరకెక్కించారు.. ముఖ్యంగా డీఎంకే సీఎం అన్నాదురై అప్పుడు ఎంజీఆర్ మంత్రిని చేయాలి అనుకున్నారని విజయకుమార్ తెలిపారు.. కానీ ఎంజీఆర్ తనకు ఆశ లేదని మంత్రి పదవిని కూడా వదులుకున్నారని తెలిసిన విషయమే.. అయితే అన్నాదురై ఒక కొత్త శాఖను కేటాయించి , ఎంజీఆర్ ను డిప్యూటీ చీఫ్ గా నియమించినట్లు విజయకుమార్ తెలిపారు. అయితే జయ కుమార్ డిమాండ్ మేరకు ఈ సినిమాలో సన్నివేశాలను మారుస్తారో లేక అలాగే ఉంచుతారో కొద్ది రోజులు వేచి చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: