ఇప్పటికీ ప్రభాస్ ను నేను భయ్యా అనే పిలుస్తాను... ?

VAMSI
తెలుగు సినిమాలో ఎందరో హీరోలు ఉన్నారు. ఒక సాధారణ హీరోగా తమ జీవితాలను స్టార్ట్ చేసి ఒక పెద్ద స్టార్ హీరోగా మారినప్పుడు కొందరు తమ స్థాయికి తగినట్టుగా అలవాట్లను మరియు ఆలోచనలను మార్చుకుంటారు. ఇదే సందర్భంలో అంతకు ముందు తమతో కలిసి పనిచేసిన ఆర్టిస్ట్ లను సైతం గుర్తు పెట్టుకోరు. అయితే అందరూ అలా ఉండరు. చిన్న నటులతో అయినా స్నేహాన్ని ఏర్పరుచుకుని వారి స్నేహాన్ని అలాగే కొనసాగిస్తారు. వారి మధ్యన ఆ స్థాయి బేధం ఎప్పుడూ చూపించరు. వారికున్న ప్రత్యేకమైన మంచి లక్షణాలతో అభిమానుల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటారు. అటువంటి ఒక బంధం గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం.
2003 లో హీరోగా తన కెరీర్ స్టార్ట్ చేసిన ప్రభాస్.. అందులో ఒక పాత్రలో నటించిన అభినయ కృష్ణ అలియాస్ అదిరే అభికి మధ్యన స్నేహం ఉంది. ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ లో ప్రభాస్ తో తనకున్న బంధాన్ని అభి తెలిపాడు. ప్రభాస్ తో మీ బంధం ఎలాంటిది మీరు ప్రభాస్ ని ఏమని పిలుస్తారు అని అడిగిన యాంకర్ ప్రశ్నకు అభి సమాధానం ఇస్తూ, " నేను మొదటి సారి ప్రభాస్ అన్నతో చేసింది ఈశ్వర్. అప్పట్లో ఆ సినిమా విడుదలయ్యాక సినిమా ఎలా ఉందని ప్రభాస్ ని అడిగాను. అప్పుడు ప్రభాస్ రే... సినిమా బాగుంది అందులో నీ నటన మా వాళ్లకు బాగా నచ్చిందని చెప్పాడు. అది విని షాక్ అయ్యాను. ఆ తర్వాత అవకాశాలు వస్తాయనుకుంటే ఏమీ రాలేదు.
ఆ తర్వాత బాహుబలి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను. అప్పుడు చాలా విషయాలు మాట్లాడుకునే వాళ్ళము.  ప్రభాస్ ఏమిరా అభి ఎలా ఉన్నారు మన టీమ్ అని అడిగాడు. అంతా బాగున్నారు రా, రాంబాబు చనిపోయాడు. అప్పుడు ప్రభాస్ కొంచెం బాధ పడ్డాడు. అలా ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నాము. అలా గతంలో మేము తీసుకున్న ఒక ఫోటో చూపించాను. అది చూసి రేయ్ నేను చాలా మారిపోయాను, నువ్వు మాత్రం అలాగే ఉన్నావు అంటూ కితాబిచ్చాడు.  బాహుబలి సినిమా షూటింగ్ లో అటు ప్రభాస్ నుండి మరియు డైరెక్టర్ రాజమౌళి నుండి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ముఖ్యంగా సినిమాలలో గ్రీన్ మ్యాట్ ద్వారా షూట్ చేసి తరువాత గ్రాఫిక్స్ చేసే విధానం గురించి తెలుసుకున్నాను. ఇప్పటికీ ప్రభాస్ ను నేను భయ్యా..అనే పిలుస్తాను" అని ఆ ఇంటర్వ్యూ లో అభినయ కృష్ణ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: