"ధృవ" సినిమాలో ఎన్ని మార్పులు చేశారో తెలుసా ?

VAMSI
మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తేజ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ను ఏర్పరుచుకున్నాడు. సినిమా సినిమాకు కొత్తదనం చూపిస్తూ ప్రేక్షకుల్లో ఎనలేని అభిమానాన్ని సంపాదించుకున్నాడు. తన కెరీర్ లో చేసిన సినిమాలు వేటికవే ప్రత్యేకం. రామ్ చరణ్ కెరీర్ లో తొలి సారి ఒక తమిళ మూవీని తెలుగు రీమేక్ చేసి ఘన విజయాన్ని సాధించాడు. ఈ సినిమా గురించి అందరికీ తెలిసినవే కొన్ని విషయాలే. కానీ తెర వెనుక జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తమిళ్ లో 2015 లో మోహన రాజ దర్శకత్వంలో వచ్చిన "తని ఒరువన్" సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ అయింది. ఒక మంచి కథతో వచ్చిన ఈ సినిమా తెలుగు నిర్మాతల్లో ఒకరైన డి వి వి దానయ్య ఈ సినిమా రీమేక్ హక్కులను 5.5 కోట్లకు దక్కించుకున్నారు.
రీమేక్ హక్కులను అయితే కొన్నాడు కానీ ఆ తర్వాత హీరో ఎవరు అనే విషయంలో చాలా చర్చ జరిగింది. ముఖ్యంగా ఇందులో హీరోగా మహేష్ బాబు మరియు రామ్ చరణ్ లలో ఒకరిని అనుకున్నారు.  అయితే ముందుగా రామ్ చరణ్ ఇందులో నటించడానికి పచ్చ జెండా ఊపాడు. హీరో ఒకే అయ్యాడు. మరి ఈ సినిమా రీమేక్ డైరెక్టర్ కోసం వేట మొదలైంది. అందుకోసం ముగ్గురి డైరెక్టర్లను పరిశీలించారు. సురేంద్ర రెడ్డి, వంశీ పైడిపల్లి మరియు మోహన్ రాజాలను అనుకున్నారు. కానీ సురేంద్ర రెడ్డి వైపే నిర్మాత మొగ్గు చూపాడు.  సురేంద్ర రెడ్డికి ఈ సినిమా స్క్రిప్ట్ ను అర్థం చేసుకోవడానికి మరియు దానిని తెలుగులో మార్చడానికి మొత్తం 6 నెలల సమయం పట్టిందని తెలుస్తోంది.  అలా మొత్తానికి ఏదో ఒక విధంగా తమిళ సినిమా తని ఒరువన్ మూవీ తమిళ స్క్రిప్ట్ ను తెలుగులోకి మార్చాడు.
రీమేక్ హక్కులను డి వి వి దానయ్య కొన్నప్పటికీ  ఈ సినిమాను రీమేక్ కు నిర్మాతగా ఈ తమిళ్ సినిమా "తని ఒరువన్" లో విలన్ కోసం ముందుగా మాధవన్ ను అనుకున్నారు. కానీ వివిధ కారణాల వలన మాధవన్ రిజెక్ట్ చేశారు. మళ్లీ రాజశేఖర్ కూడా నటించాల్సి ఉంది. కానీ ఆ తరువాత ప్రాజెక్ట్ లోకి అరవింద్ స్వామి ఎంటర్ అయ్యాడు.  ఇందులో హీరోయిన్ గా మొదట శృతిహాసన్ ను తీసుకోగా షెడ్యూల్ కుదరకపోవడం కారణంగా రకుల్ ప్రీత్ సింగ్ వచ్చింది. ఈ సినిమాలో విలన్ పాత్ర చేసిన అరవింద్ స్వామి పాత్రకు డబ్బింగ్ చెప్పింది సింగర్ హేమచంద్ర కావడం విశేషం. అలా సినిమా సెట్స్ పైకి వెళ్లి విజయవంతంగా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది.  ఈ సినిమా అన్ని హక్కులను కలుపుకుని 69 కోట్లకు బిజినెస్ జరిగింది. ధృవ తన టోటల్ రన్ లో 85 కోట్లను కలెక్ట్ చేసి కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: