రాజమౌళి, శంకర్ సినిమాలతో రామ్ చరణ్, ప్రభాస్ ను దాటగలడా..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా దేశంలో పలు మార్లు కరోనా విజృంభించడంతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా తో పాటు రామ్ చరణ్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాలో కూడా చిరంజీవితో పాటు ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించబోతుంది. ఈ రెండు సినిమాలలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా పాన్ ఇండియా చిత్రం. రామ్ చరణ్ , శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తూ తెరకెక్కే సినిమా కూడా పాన్ ఇండియా చిత్రమే.

ఇలా తెలుగులో ప్రభాస్ తర్వాత ఎక్కువ మోస్ట్ క్రేజీ పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న తెలుగు హీరో రామ్ చరణ్. ప్రభాస్ ఇప్పటికే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత వెంటనే 'సాహో' సినిమాలను కూడా పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించి, విడుదల చేశాడు. ప్రస్తుతం కూడా ప్రభాస్ నాలుగు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఇలా ఇప్పటివరకు తెలుగులో మోస్ట్ బిజీయెస్టు పాన్ ఇండియా యాక్టర్ గా ప్రభాస్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ కూడా ఇటు రాజమౌళి సినిమాతో మరియు అటు శంకర్ సినిమాలతో ప్రభాస్ కు ధీటుగా నిలబడపోతున్నాడు అని కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, మరి కొంతమంది మాత్రం రాజమౌళి, శంకర్ సినిమాల రిజల్ట్ ను బట్టి రామ్ చరణ్ మార్కెట్ డిసైడ్ అవుతుంది అంటూ వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: