ఉదయ్ కిరణ్ కు "నువ్వు నేను" సినిమాలో అవకాశం ఎలా వచ్చిందంటే?

VAMSI
అప్పుడప్పుడే తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చి చిత్రం సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ తేజ తరువాత సినిమాలో హీరో కోసం ప్రయత్నిస్తున్న రోజులవి, డైరెక్టర్ గా తేజలో ఉన్నఒక లక్షణం ఏమిటంటే ముందుగా ఒక కథను అనుకుని దానిని పూర్తిగా రాసేసి అప్పుడు దాని పాత్రల కోసం నటులను వెతికే పనిలో పడతారు. కానీ చాలా మంది డైరెక్టర్ లు మాత్రం ముందుగా ఒక హీరోను అనుకుని అప్పుడు కథ రాయడం మొదలెడతారు. ఓకే అది పక్కన పెడితే, చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తరువాత సినిమా చేయడానికి రెడీ గా ఉన్నాడు. అప్పుడు "నువ్వు నేను" కథను సిద్ధం చేసుకున్నాడు. హీరో ఎవరైతే బాగుంటుందా అనుకునే తరుణంలో తమిళ్ హీరో మాధవన్ ను సంప్రదించాడు. ఆయనను అడగగానే ఒక్క మాటలో నేను తెలుగు సినిమాలు చేయనని చెప్పేశాడట.
దీనితో తేజకు ఏమి చేయాలో అర్ధం కాలేదట. అయితే చిత్రం తరువాత చిత్రం సినిమాతో హీరోగా పరిచయమయిన ఉదయ కిరణ్ అవకాశాలు ఏమీ రాకపోవడంతో ప్రతి రోజూ తేజ ఆఫీస్ కు వచ్చి తన ముందు కింద కూర్చుని వెళ్లేవాడట. సరే ఇక మాధవన్ కాదనడంతో తేజ బాగా అలోచించి, ఉదయకిరణ్ ఎవరో ఎందుకు "నువ్వు నేను" లో నువ్వే హీరో రెడీగా ఉండు షూటింగ్ కి అని చెప్పారట. ఇక దానితో ఉదయకిరణ్ ఆనందానికి హద్దులు లేవట. అలా ఉదయ కిరణ్ కు రెండవసారి తేజ తో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందట. ఒకవేళ ఆ రోజు తేజ అడిగినప్పుడు మాధవన్ ఆ సినిమా చేసి ఉంటే మనము ఒక్క మంచి మనిషిని అలాగే లవర్ బాయ్ నుండి వచ్చిన సినిమాలను మిస్ అయి ఉండే వాళ్ళము.
అందుకే ఏనాడో దేవుడు రాసి ఉంటాడు. ఆయన రాసినట్టే అన్నీ జరుగుతూ ఉంటాయి. ఆలా అవకాశం దక్కించుకున్న అమాయక హీరో ఉదయ కిరణ్ వరుస హిట్ లను సాధిస్తూ సినీ కెరీర్ లో అందనంత ఎత్తుకు చేరుకున్నాడు. కానీ కొంతకాలం తరువాత సినిమా ఇండస్ట్రీలో పోటీ ఎక్కువ కావడం మరియు ఇతర వ్యక్తిగతః కారణాల వలన అవకాశాలు రావడం అరుదుగా మారాయి. దీనితో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేటికీ అందరి మనసులో చెరగని గుర్తులా మిగిలిపోయాడు ఉదయ్ కిరణ్.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: