చిత్రపురి కాలనీని దానంగా ఇచ్చింది ఈయనే..?

Divya
చిత్రపురి కాలనీ కి పెట్టిన పేరు వింటేనే.. ఈ కాలనీ ని ఎవరు నిర్మించారో పూర్తిగా తెలుస్తుంది.. చిత్రపురి కాలనీని ఎం ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ అని అందరూ పిలుచుకుంటూ ఉంటారు.. ప్రముఖ నటుడిగా , విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన ఎం ప్రభాకర్ రెడ్డి. ఈయన డాక్టర్.. కానీ నటన మీద ఆసక్తితో డాక్టర్ పదవిని విడిచి సినీ ఇండస్ట్రీలోకి నటుడి పదవిని చేపట్టాడు.. 1990 సంవత్సరంలో మొదటి సారిగా తెలుగు చిత్ర పరిశ్రమ అప్పటివరకు మద్రాస్ లో ఉండగా, దాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ కు మార్చడం జరిగింది .అలా మొదటి సారి తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వడం జరిగింది.
అలా వస్తున్న సమయంలో ప్రభుత్వం  సినిమా వాళ్లకు అప్పట్లో కొన్ని ఎకరాల కొద్దీ భూములను ఇచ్చిన విషయం తెలిసిందే. అగ్ర నటులకు మాత్రమే ప్రభుత్వ స్థలాన్ని కేటాయించింది. అయితే ఆ సమయంలో ఎంతో మంది సినీ కళాకారులు కూడా వచ్చారు.. వారికి ఆశ్రయం లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రభాకర్ రెడ్డికి ప్రభుత్వం ఇచ్చిన పది ఎకరాల స్థలాన్ని సినీ కళాకారుల కోసం , ఆయన ఉచితంగా ఇవ్వడం గమనార్హం. అంతేకాదు వీరి నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ప్రభుత్వం ఇచ్చిన పది ఎకరాల భూమిని కార్మికులకు ఇచ్చేసారు డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి..
ఈయన పేరు మీదనే హైదరాబాద్ మణికొండ లో ఉన్న డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురికి, ఈ గొప్ప దాన కర్త పేరు పెట్టడం గమనార్హం.. చెప్పే మాటల కన్నా చేసే చేతులే మిన్న అనే పదానికి చక్కటి నిర్వచనం ఈయన.. ఎన్నో పాత్రల్లో నటించి, తనకంటూ మంచి గుర్తింపు పొందిన ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు రచయిత కూడా ..ఇలా దాదాపుగా 21 తెలుగు సినిమాలకు కథలను అందించడం గమనార్హం.. స్టార్ హీరోల సినిమాలలో నటించి, ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు ప్రభాకర్ రెడ్డి.. దాదాపు 500 సినిమాలలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: