శ్రీరామచంద్ర గానం మృదుమధురం !

NAGARJUNA NAKKA
శ్రీరామ చంద్ర పేరు వినగానే సంగీత అభిమానులు ఆసక్తిగా చెవి పెడతారు. ఆ గొంతు నుండి జాలువారే లయబద్దమైన సంగీతాన్ని ఆస్వాదించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎంతటి ఒత్తిడిలో ఉన్నా.. ఆయన సంగీతంలో మైమరిచిపోతారు. మైనంపాటి శ్రీరామచంద్రను సింపుల్ గా శ్రీరామచంద్ర అని పిలుచుకుంటారు. ప్రకాశంజిల్లాలోని అద్దంకి ఆయన స్వగ్రామం. రామచంద్ర హైకోర్టులో లాయర్ కాగా.. జయలక్ష్మి ఇంటి వ్యవహారాలు చూసుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే సెటిల్ అయింది వీరి కుటుంబం. చిన్నప్పటి నుండి శ్రీరామ చంద్రకు సంగీతమంటే చెవులు కోసుకుంటాడు. తన మామయ్యకు ఆర్కెస్ట్రా ఉండటంతో.. ఆయనతో కలిసి పాటల కచేరీలకు వెళ్లేవాడు.

ఎనిమిదేళ్ల వయసులోనే తన ప్రతిభ కనుబరిచాడు శ్రీరామ చంద్ర. తొలిసారిగా రవీంద్రభారతిపై తన ప్రతిభను కనుబరిచి.. ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత హరిప్రియ దగ్గర ఐదేళ్ల పాటు కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు. పాస్ అగస్టీన్ దగ్గర వెస్ట్రన్ క్లాసికల్ సంగీతం అభ్యసించాడు. అంతటితో ఆగలేదు... ముంబైలో గౌతం ముఖర్జీ దగ్గర హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నాడు. అంతేకాదు శ్రీ భక్త రామదాసు మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కళాశాలలో చేరి తన ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నాడు శ్రీరామచంద్ర.
2005నుంచి ప్రేక్షకులను సంగీత లోకంలో విహరింపజేస్తున్న శ్రీరామచంద్ర.. 2010లో ఇండియన్ ఐడల్ లో విజయం సాధించాడు. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ ప్రోగ్రామ్ కు గెస్ట్ గా వచ్చిన వాళ్లు ఆయన పాటలకు ఆకర్షితులై.. శ్రీరామచంద్రతో కలిసి స్టెప్పులేశారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు శ్రీరామచంద్రకు అభిమానులైపోయారు. అంతేకాదు ప్రముఖ సంగీత దర్శకులు సైతం శ్రీరామచంద్రను పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పటి వరకు శ్రీరామచంద్ర రెండు వందలకు పైగా పాటలు పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు.
మరోవైపు గాయకుడి గానే కాదు.. నటుడిగా తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్నాడు. శ్రీ జగద్గురు ఆది శంకరా, ప్రేమ గీమ జాన్‌తా నయ్ చిత్రాల్లో హీరోగా నటించారు. పలు ప్రకటనల్లో నటించడంతో పాటు.. పలువురు నటులకు గొంతు అరువిచ్చాడు. శ్రీరామచంద్ర  ప్రతిభా పాటవాలకు పలు పురస్కారాలు కూడా వరించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: